Saturday, December 21Lend a hand to save the Planet
Shadow

Tag: major millets

Kharif Season | దెబ్బ‌తీసిన వ‌ర్షాలు.. తెలంగాణలో గత ఐదేళ్లలో ఈసారి అత్యల్ప సాగు

Kharif Season | దెబ్బ‌తీసిన వ‌ర్షాలు.. తెలంగాణలో గత ఐదేళ్లలో ఈసారి అత్యల్ప సాగు

Organic Farming
Kharif Season | హైదరాబాద్ : ఈ వనకాలం (ఖరీఫ్) సీజన్‌లో తెలంగాణలో పంటల సాగు తీవ్రంగా ప‌డిపోయింది.మొత్తం పంట విస్తీర్ణం దాదాపు 1.23 కోట్ల ఎకరాలకే పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో 1.29 కోట్ల ఎకరాల సాధారణ విస్తీర్ణంలో 1.28 కోట్ల ఎకరాల్లో సాగు చేశారు. సీజన్ ముగియడానికి ఇంకా రెండు వారాల కంటే తక్కువ సమయం ఉంది. మొత్తం పంట విస్తీర్ణం ఇప్ప‌టికిప్పుడు మెరుగుపడే అవకాశం లేదు.గ‌తేడాది స‌మ‌యానికి పంట‌ల‌కు స‌రిప‌డా సాగునీరు, రైతుబంధు వ్యవసాయ పెట్టుబడి అందడంతో. వ్యవసాయ సాగు వృద్ధికి ఊతమిచ్చింది. గత సంవత్సరాలతో పోల్చినప్పుడు, కోవిడ్ అనంతర కాలంలో వనకాలం సీజన్‌లో ఈసారి అత్యల్పంగా విస్తీర్ణం న‌మోదైంది. సెప్టెంబరు 12 నాటికి 1.23 కోట్ల ఎకరాల్లో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. వనాకాలం సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 1.29 కోట్ల ఎకరాల్లో 95 శాతం ఉండేది. గతేడాది 1.28 కోట్ల ఎకరాల్లో నాట్లు పూర్తికాగా, ఈసారి ప‌ర...