National Farmers Day 2024 : జాతీయ రైతు దినోత్సవం ప్రత్యేకత ఏమిటి?
National Farmers Day 2024 : దేశానికి రైతులు చేస్తున్న అమూల్యమైన సేవలను గుర్తించేందుకు వారిని గౌరవించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం, లేదా కిసాన్ దివస్ (Kisan Diwas 2024), జరుపుకుంటారు. భారతదేశ ఐదవ ప్రధానమంత్రి, రైతుల కోసం పోరాడిన ప్రముఖ నేత చౌదరి చరణ్ సింగ్ (Chaudhary Charan Singh) జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. జాతీయ రైతు దినోత్సవం 2024 దేశానికి వెన్నెముకగా నిలుస్తూ రక్తాన్ని చమటగా మార్చి కష్టపడి పనిచేసే రైతులకు తలవంచి ప్రణమిల్లాల్సిన రోజు.కిసాన్ దివస్ చరిత్ర:Kisan Diwas History : రైతు అనుకూల విధానాలను తీసుకొచ్చి రైతుల సంక్షేమం కోసం కృషి చేసినందుకు మాజీ ప్రధాని చరణ్ సింగ్ (Charan Singh) జన్మదినం సందర్భంగా జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటారు అతను జూలై 1979 నుంచి జనవరి 1980 మధ్య ప్రధానమంత్రిగా పనిచేశారు. చౌదరి చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన...