పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ కోసం 1.3 కోట్ల కుటుంబాల దరఖాస్తు..
PM Rooftop Solar Scheme | ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.3 కోట్లకు పైగా కుటుంబాలు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నాయి. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో సోమవారం జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ (రీ-ఇన్వెస్ట్) 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. సోలార్ రూఫ్‌టాప్ పథకం ప్రారంభించినప్పటి నుంచి.. సుమారు 3.75 లక్షల ఇళ్లలో ఇన్‌స్టాలేషన్ పూర్తయిందని, వారు ప్రస్తుతం ఉచితంగా సోలార్ విద్యుత్ ను వినియోగించుకుంటున్నారని, పేదల ప్రజలపై కరెంటు బిల్లుల భారం తగ్గిపోయిందని ప్రధాని మోదీ తెలిపారు.PM Rooftop Solar Scheme ద్వారా తమ ఇంటిపై సోలార్‌ప్యానెల్స్ ను ఇన్ స్టాల్ చేసుకున్న వినియోగదారులు తమకు అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా.. అదనపు విద్యుత్...