
Hero MotoCorp vida .. 300 ఈవీ చార్జింగ్ స్టేషన్లు
తొలిసారి ఈ మూడు నగరాల్లోనే..
దేశంలోని అతపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero MotoCorp .. బెంగళూరు, ఢిల్లీ, జైపూర్‌లలో పబ్లిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసే కార్యకలాపాలను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల కోసం ఈ మూడు నగరాల్లోని 50 ప్రదేశాలలో సుమారు 300 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. Hero MotoCorp ఇటవలే Vida బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్‌వాహన రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.కస్టమర్ల కోసం కీలకమైన ప్రదేశాలలో ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరించినట్లు కంపెనీ తెలిపింది. Vida ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లలో వినియోగదారులు వారి ఇ-స్కూటర్ బ్యాటరీని 1.2 kms/min వేగంతో ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఛార్జింగ్ స్టేషన్‌లో DC తోపాటు AC ఛార్జింగ్ సాకెట్లు ఉంటాయి.
Hero MotoCorp vida ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ (EMBU) హెడ్ - డాక్టర్ స్వదేశ్ శ...