ఈవీ కంపెనీల మధ్య ధరల యుద్ధం
పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహన సంస్థలు
దేశంలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీలు అధిక ఇన్‌పుట్ ఖర్చు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ కస్టమర్‌లను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈవీ మార్కెట్‌లో పుట్టుకొస్తున్న కొత్తకొత్త కంపెనీలు కూడా అనేక ఆఫర్లతో దిగ్గజ కంపెనీలకు సవాల్ విసురుతున్నాయి. Electric two-wheeler offersదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ S1 ప్రో ధరలను రూ.16,000 తగ్గించింది. ప్రస్తుతం దీని ధర రూ.127,999. అలాగే జీరో ప్రాసెసింగ్ ఫీజులు, లోన్‌లపై జీరో డౌన్ పేమెంట్, ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి ఆఫర్లను అందిస్తోంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఓలా ఇలాంటి పథకాలను అమలు చేస్తోంది...