Home » Okinawa Autotech ఏడాదిలోనే లక్ష అమ్మకాలు

Okinawa Autotech ఏడాదిలోనే లక్ష అమ్మకాలు

Spread the love

Okinawa Autotech : ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ కంపెనీ ఒకినావా త‌న అమ్మ‌కాల‌తో దూసుకుపోతోంది. హై-స్పీడ్ లో -స్పీడ్ మోడ‌ళ్లుఅన్నీ క‌లిపి దేశంలో 100,000 యూనిట్లను విక్ర‌యించింది. ఈ సంవత్సరం విక్రయాల ఊపందుకోవడానికి ప్రధానంగా అత్యంత పాపుల‌ర్ అయిన, అలాగే స్థానికంగా తయారు చేయబడిన iPraise+ అలాగే ప్రైజ్ ప్రో మోడ‌ళ్లే కార‌ణం. ఇది వార్షిక అమ్మకాలలో దాదాపు 60 – 70 శాతం వాటాను కలిగి ఉంది. ఒకినావా క్లిష్టమైన డిజైన్‌లు, హై-టెక్ సామర్థ్యాలతో భారతదేశంలో ఆదర్శవంతమైన ‘ఫ్యామిలీ ఇ-స్కూటర్‌లుగా గుర్తింపు పొందాయి.

Okinawa electric scooters

దేశవ్యాప్తంగా విస్త‌ర‌ణ‌

ఒకినావా తన స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ తన డీలర్‌షిప్‌లను మెట్రో నగరాలతోపాటు టైర్ 2, టైర్ 3, భారతదేశంలోని గ్రామీణ మార్కెట్‌లకు 400 పైగా ట‌చ్‌పాయింట్లకు విస్తరించింది. నవంబర్‌లో కంపెనీ ఉత్తరాఖండ్‌లో ఓకినావా గెలాక్సీ – స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ Okinawa Galaxyలో కస్టమర్‌లు ఉత్పత్తులను, అలాగే దాని తయారీ వివ‌రాల‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించ‌వ‌చ్చు. రాబోయే సంవత్సరంలో భార‌త‌దేశ వ్యాప్తంగా మరో 50 గెలాక్సీ స్టోర్స్ ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది.

రూ.500కోట్ల పెట్టుబ‌డికి సిద్ధం..

ఒకినావా రాబోయే మూడు సంవత్సరాలలో మొత్తం రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టాల‌ని భావిస్తోంది. మొదటి దశలో మొదటి ఏడాది రూ. 250 కోట్ల మొత్తం పెట్టుబడి పెడుతుంది. రాబోయే సంవత్సరాల్లో ఈ మొత్తం క్రమంగా పెరుగుతుంది. మోటార్లు, కంట్రోల‌ర్ల కోసం సొంత అసెంబ్లీ లైన్‌ను కలిగి ఉన్న మొదటి ఏకైక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఒకినావా. దీనితో బ్యాట‌రీని మిన‌హాయిస్తే 100 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ దేశీయంగానే త‌యార‌వుతుంది. కేవ‌లం బ్యాట‌రీ సెల్స్‌ను మాత్ర‌మే ప్ర‌స్తుతానికి దిగుమతి చేసుకుటోంది. ఒకినావా తన సరికొత్త హై స్పీడ్ స్కూటర్‌ను వచ్చే ఏడాది సంవత్సరం మొదటి త్రైమాసికంలో విడుదల చేయడానికి ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంటోంది.

Okinawa Autotech MD & స్థాపకుడు జితేందర్ శర్మ మాట్లాడుతూ.. ఒకినావాపై నమ్మకాన్ని వ్యక్తం చేసిన, ల‌క్ష అమ్మ‌కాల మైలురాయిని సాధించడంలో త‌మ‌కు సహాయపడిన అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మా డైనమిక్ ప్రొడ‌క్ట్, ప్రత్యేకమైన రైడింగ్ అనుభవాలతో ఒకినావా.. భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్‌ల వ్యాప్తిలో కొత్త మైలురాళ్లను నెలకొల్పింద‌ని తెలిపారు. తాము మొద‌టి నుంచి ఈవీల‌పై అవగాహన పెంచడం, EVలపై అపోహలను తొలగించడం వంటి చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్ల పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను, అవసరాలను తీర్చడం కోసం మా ప్రయత్నాల‌ను కొన‌సాగిస్తునే ఉంటామ‌ని వ్యాఖ్యానించారు.

మరిన్ని అప్‌డేట్‌ల కోసం హ‌రిత‌మిత్ర వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించిన వీడియోల కోసం మా Haritha mithra YouTubeHaritha mithra YouTube ఛానెల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకోండి..!

One thought on “Okinawa Autotech ఏడాదిలోనే లక్ష అమ్మకాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *