Okinawa electric scooters రీకాల్ చేస్తోంది.. ఎందుకు?
ప్రముఖ Electric scooter తయారీదారు Okinawa Autotech తమ వాహనాల్లోని బ్యాటరీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి 3,215 బ్యాటరీలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. "ఇటీవలి ఒకినావా వాహనం కాలిపోయిన సంఘటన, అలాగే కస్టమర్ భద్రత కోసం కంపెనీ తాజా నిర్ణయం తీసుకుంది. భారతదేశంలోని ఏ Electric Vehicles తయారీ సంస్థ అయినా స్వచ్ఛందంగా రీకాల్ చేయడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు.ఈవీ తయారీ సంస్థ Okinawa ఏడేళ్ల క్రితం స్థాపించబడింది. దీని పోర్ట్ఫోలియోలో మూడు లోస్పీడ్, నాలుగు హై-స్పీడ్ స్కూటర్‌లు ఉన్నాయి. త్వరలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కూడా ప్రారంభించనున్నారు. సమగ్ర పవర్ ప్యాక్ హెల్త్ చెకప్ కోసం రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా బ్యాటరీలు లూజ్ కనెక్టర్లు లేదా ఏదైనా డ్యామేజ్ ఉందా అనే అంశాలను తనిఖీ చేస్తారు. భారతదేశంలోని ఒకినావా అధీకృత డీలర్‌లలో వినియోగదారుల వాహనాలక...