Ola S1X 4kWh బ్యాటరీ ప్యాక్‌తో కొత్త స్కూటర్.. అన్నిస్కూటర్లపై 8ఏళ్ల వారంటీ..
Ola Electric S1X 4kWh : ఎలక్ట్రిక్ స్కూటర్ల ద్వారా గ్రీన్ మొబిలిటీని మరింతగా పెంచడానికి ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు పవర్ ఫుల్ 6kW మోటార్, 190 కి.మీ.ల లాంగ్ రేంజ్ తో ఓలా S1X 4kWh వేరియంట్ ను విడుదల చేసింది. ఈ కొత్త S1X 4kWh ఎక్స్ షోరూం ధర రూ. 1,09,999 గా ఉంది. దీని డెలివరీలు ఏప్రిల్ 2024 నుండి ప్రారంభమవుతాయి. మరో నమ్మశక్యం కాని శుభవార్త ఏంటంటే.. కంపెనీ తన అన్ని స్కూటర్లకు 8 సంవత్సరాలు లేదా 80,000 కిమీల వరకు ఎక్స్ టెండెడ్ బ్యాటరీ వారంటీని కూడా ప్రకటించింది. దీంతో బ్యాటరీ హెల్త్ గురించి కస్టమర్ ఆందోళన చెందాల్సిన అవసరం తప్పింది. EV స్వీకరణకు అతిపెద్ద అడ్డంకిని తొలగించినట్లైంది.కొత్త ఆఫర్ పై ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ & MD భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. “ తమ ఉత్పత్తులు, సేవలు, ఛార్జింగ్ నెట్‌వర్క్ , బ్యాటరీ వారంటీ వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా EV స్వీకరణకు ఉన్...