Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tag: rooftop solar power systems

Solar Panels For Home | ఇల్లు కట్టుకుంటున్నారా? అయితే సోలార్ పానల్ పెట్టుకోవాల్సిందే..

Solar Panels For Home | ఇల్లు కట్టుకుంటున్నారా? అయితే సోలార్ పానల్ పెట్టుకోవాల్సిందే..

Solar Energy
Solar Panels For Home | మీరు కొత్తగా ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా సోలార్ పానల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌అధికారులు కొత్తగా ఈ నిబంధనలు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇకపై ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్‌ప్యానెల్స్‌ (Rooftop Solar Power) ఏర్పాటు చేసుకుంటేనే ఇంటి అనుమతులు మంజూరు చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకొని విధివిధానాలను రూపొందించనున్నారు. రాష్ట్రంలో సౌరవిద్యత్ తయారీని ప్రోత్సహించేందుకు గాను ఈ తాజా నిర్ణయం దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ప్రతీ ఇంటిపై సోలార్‌ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా స్థానిక అవసరాలకు విద్యుత్ ను ఉత్పత్తి అవుతుంది. తద్వారా దీనివల్ల నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న విద్యుత్‌ డిమాండ్ తీర్చవచ్చు.Solar Panels For Home : కాలుష్యరహితమైన పర్యావరణానికి...
Solar Rooftop Scheme 2024 :రూఫ్ టాప్ సోలార్ సిస్టం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

Solar Rooftop Scheme 2024 :రూఫ్ టాప్ సోలార్ సిస్టం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

Solar Energy
Solar Rooftop Yojana 2024 :  మధ్యతరగతి ప్రజలకు కరెంటు బిల్లుల భారం తగ్గించేందుకు  కేంద్ర ప్రభుత్వం ఉచిత సోలార్ రూఫ్‌టాప్ పథకం 2024 (Free Solar Rooftop Scheme 2024 ) పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో విద్యుత్‌ను అందించడం సాధ్యం కాదు, అందువల్ల సౌరశక్తి ద్వారా మీరు విద్యుత్‌ను పొందవచ్చు. మీరు మీ కరెంటు బిల్లలను తగ్గించుకోవమే కాకుండా మీ విద్యుత్ అవసరాలను పూర్తిగా సోలార్ ఎనర్జీతో తీర్చుకోవచ్చుఉచిత సోలార్ రూఫ్‌టాప్ పథకంలో మీరు ప్రభుత్వ సబ్సిడితో తక్కువ డబ్బు చెల్లించి సోలార్ ప్యానెల్స్ ను మీ ఇంటిపై ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.. ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు. ఈ పథకం కింద, మీ ఇల్లు లేదా మీ ఆఫీసు పైకప్పుపై సోలార్ ప్లేట్‌లను అమర్చవచ్చు. విద్యుత్ ఖర్చులను వదిలించుకోవచ్చు.  అయితే  ఉచిత సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ 2024 కు అర్హత, నిబంధనలు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఎలా లాగిన్ చేయాలి...
కేంద్రం కొత్తగా ప్రారంభించిన‌ రూఫ్‌టాప్ సోలార్ పవర్ స్కీమ్ ఏమిటి? దీని వ‌ల్ల మ‌నకు ప్ర‌యోజ‌న‌మేంటి?

కేంద్రం కొత్తగా ప్రారంభించిన‌ రూఫ్‌టాప్ సోలార్ పవర్ స్కీమ్ ఏమిటి? దీని వ‌ల్ల మ‌నకు ప్ర‌యోజ‌న‌మేంటి?

Solar Energy
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ‌త సోమవారం 'ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన (Pradhan Mantri Suryodaya Yojana) ను ప్రకటించారు. ఇది ప్రభుత్వ పథకం. దీని కింద కోటి గృహాలకు రూఫ్‌టాప్ సౌర విద్యుత్ సిస్టంలు లభిస్తాయి.రూఫ్‌టాప్ సోలార్ పవర్ సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను ప్రోత్సహించడానికి ఇది మొదటి పథకం కాదు. 2014లోనే ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది, ఇది 2022 నాటికి 40,000 మెగావాట్లు (MW) లేదా 40 గిగావాట్ల (GW) సోలార్ ఎన‌ర్జీ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ప‌లు కార‌ణాల వ‌ల్ల ప్ర‌భుత్వం ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. దీంతో ప్రభుత్వం 2022 నుండి 2026 వరకు గడువును పొడిగించింది. అయితే కొత్తగా ప్రారంభించిన‌ ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన ప‌థ‌కం విజ‌య‌వంత‌మైతే 40 GW రూఫ్ టాప్ సోలార్ ప‌వ‌ర్ సామర్థ్యం లక్ష్యాన్ని చేరుకోవడం సుల‌భ‌త‌ర‌మ‌వుతుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ...