
Solar Cell | రూ.7000 కోట్లతో తెలంగాణలో సోలార్ సెల్స్ తయారీ యూనిట్
Solar cell Manufacturing Unit : తెలంగాణలో పునరుత్పాదక శక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ అక్షత్ గ్రీన్ టెక్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ హైదరాబాద్‌లో 6.9 గిగావాట్ల సోలార్ సెల్స్, 6.9 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుపై రూ.7,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.2500 మందికి ఉపాధితెలంగాణలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ (Solar cell Manufacturing Plant) ద్వారా దాదాపు 2,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. స్థానికంగా మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల సమక్షంలో అక్షత్ గ్రీన్‌టెక్ తో (మైత్రా గ్రూప్) అవగాహన ఒప్పందం కుదుర్...