కేంద్రం కొత్తగా ప్రారంభించిన రూఫ్‌టాప్ సోలార్ పవర్ స్కీమ్ ఏమిటి? దీని వల్ల మనకు ప్రయోజనమేంటి?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత సోమవారం 'ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన (Pradhan Mantri Suryodaya Yojana) ను ప్రకటించారు. ఇది ప్రభుత్వ పథకం. దీని కింద కోటి గృహాలకు రూఫ్‌టాప్ సౌర విద్యుత్ సిస్టంలు లభిస్తాయి.రూఫ్‌టాప్ సోలార్ పవర్ సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను ప్రోత్సహించడానికి ఇది మొదటి పథకం కాదు. 2014లోనే ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది, ఇది 2022 నాటికి 40,000 మెగావాట్లు (MW) లేదా 40 గిగావాట్ల (GW) సోలార్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే, పలు కారణాల వల్ల ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. దీంతో ప్రభుత్వం 2022 నుండి 2026 వరకు గడువును పొడిగించింది. అయితే కొత్తగా ప్రారంభించిన ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన పథకం విజయవంతమైతే 40 GW రూఫ్ టాప్ సోలార్ పవర్ సామర్థ్యం లక్ష్యాన్ని చేరుకోవడం సులభతరమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
...