Saturday, August 30Lend a hand to save the Planet
Shadow

Tag: solar power

Tata Power | ఏపీలో టాటా ప‌వ‌ర్‌ 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు

Tata Power | ఏపీలో టాటా ప‌వ‌ర్‌ 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు

Solar Energy
టాటా రెన్యువబుల్ ఎనర్జీ (Tata Power Renewable Energy (TPREL)) తో ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్ ఎన‌ర్జీ రంగంలో టాటా సంస్థ‌ రూ.49వేల కోట్ల పెట్టుబడులు పెట్ట‌నుంది. పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో వచ్చే ఐదు సంవ‌త్స‌రాల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాల‌ని ప్రభుత్వం పెట్టుకుంది.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి దిశ‌గా కీలక ముందడుగు పడిందని రాష్ట్ర‌ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 7వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం టాటా పవర్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఆయ‌న వెల్ల‌డించారు. దీని ద్వారా 7.5లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సైతం కొత్త బ‌లం వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన టాటా సంస్థకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.ఆంధ్రప్...
Solar Cell | రూ.7000 కోట్లతో తెలంగాణలో సోలార్ సెల్స్ తయారీ యూనిట్

Solar Cell | రూ.7000 కోట్లతో తెలంగాణలో సోలార్ సెల్స్ తయారీ యూనిట్

Solar Energy
Solar cell Manufacturing Unit : తెలంగాణలో పునరుత్పాదక శక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ అక్షత్ గ్రీన్ టెక్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ హైదరాబాద్‌లో 6.9 గిగావాట్ల సోలార్ సెల్స్, 6.9 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుపై రూ.7,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.2500 మందికి ఉపాధితెలంగాణలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ (Solar cell Manufacturing Plant) ద్వారా దాదాపు 2,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. స్థానికంగా మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల సమక్షంలో అక్షత్ గ్రీన్‌టెక్ తో (మైత్రా గ్రూప్) అవగాహన ఒప్పందం కుదుర్...
Green Power Generation | తెలంగాణ‌కు 20 గిగావాట్ల గ్రీన్ పవర్‌

Green Power Generation | తెలంగాణ‌కు 20 గిగావాట్ల గ్రీన్ పవర్‌

General News
Green Power Generation : తెలంగాణలో 20 గిగావాట్ల (20GW) గ్రీన్ ప‌వ‌ర్ ఉత్ప‌త్తి చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భ‌ట్టి మ‌ల్లు విక్ర‌మార్క వెల్లడించారు. పున‌రుత్పాద‌క విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 2030 నాటికి ఈ ల‌క్ష్యాన్ని చేరుకుంటామ‌ని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిసెంబ‌రు 14 నుంచి 20 వ‌ర‌కు జాతీయ ఇంధ‌న పొదుపు వారోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ‌లో విద్యుత్ పొదుపు వేడుకల‌ను ఘనంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర పునరుత్పత్తి విద్యుత్ అభివృద్ధి సంస్థ (TGREDCO) రూపొందించిన క్యాలెండ‌ర్‌ను ఉపముఖ్యమంత్రి ఆవిష్క‌రించారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో శుక్ర‌వారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2030 నాటికి 20GW పునరుత్పత్తి విద్యుత్, 2035 నాటికి 40GW విద్యుత్‌ ఉత్పత్తికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించింద‌ని తెలి...
Renewable Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు

Renewable Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు

Solar Energy
Renewable Energy : గుజరాత్‌ రాజధాని గాంధీనగర్ లో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సు (RE Invest 2024 ) లో పలు రాష్ట్రాలు భాగస్వాముల‌య్యాయ‌ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ (Pralhad Joshi) తెలిపారు. 2030 నాటికి రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. సంప్ర‌దాయ‌ విద్యుత్‌ రంగాన్ని పునరుత్పాదక ఇంధన రంగంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్ర‌ణాళికా బ‌ద్దంగా ప‌నిచేస్తోంద‌ని తెలిపారు. ఈ సదస్సులో నాలుగు దేశాలు హాజరయ్యాయని వెల్ల‌డించారు. మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మంగళవారం గాంధీనగర్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడారు.పునరుత్పాదక ఇంధన రంగం (Renewable Energy) లో భారత్‌ ప్రపంచానికి రోల్‌మాడ‌ల్‌గా నిల‌వ‌నుంద‌ని మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ధీమా వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం సుమారు 208 గిగావాట్‌ పునరుత్పాదక ఇంధనాన్ని మ‌న‌దేశం ఉత్పత్తి చేస...
Bhatti Vikramarka |  సోలార్ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం..

Bhatti Vikramarka | సోలార్ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం..

Solar Energy
Solar Power | తెలంగాణ రాష్ట్రం 2035 నాటికి 40 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఎదుగుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించిన గ్రీన్ పవర్ ఎనర్జీ పెట్టుబడిదారుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సదంర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సోలార్ రంగం (Solar Power )లో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకురావాలని, హైదరాబాద్ లో అన్ని అవకాశాలను కల్పిస్తున్నట్లు వివరించారు. గ్రీన్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం సమగ్ర ఇంధన విధానాన్ని అభివృద్ధి చేస్తోందని చెప్పారు.పెరుగుతున్న ఇంధన అవసరాలను సమతుల్యం చేయడం స్థిరత్వానికి మార్గమని తెలిపారు. తెలంగాణలో ఆర్టిఫిష...
Solar Panels For Home | ఇల్లు కట్టుకుంటున్నారా? అయితే సోలార్ పానల్ పెట్టుకోవాల్సిందే..

Solar Panels For Home | ఇల్లు కట్టుకుంటున్నారా? అయితే సోలార్ పానల్ పెట్టుకోవాల్సిందే..

Solar Energy
Solar Panels For Home | మీరు కొత్తగా ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా సోలార్ పానల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌అధికారులు కొత్తగా ఈ నిబంధనలు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇకపై ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్‌ప్యానెల్స్‌ (Rooftop Solar Power) ఏర్పాటు చేసుకుంటేనే ఇంటి అనుమతులు మంజూరు చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకొని విధివిధానాలను రూపొందించనున్నారు. రాష్ట్రంలో సౌరవిద్యత్ తయారీని ప్రోత్సహించేందుకు గాను ఈ తాజా నిర్ణయం దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ప్రతీ ఇంటిపై సోలార్‌ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా స్థానిక అవసరాలకు విద్యుత్ ను ఉత్పత్తి అవుతుంది. తద్వారా దీనివల్ల నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న విద్యుత్‌ డిమాండ్ తీర్చవచ్చు.Solar Panels For Home : కాలుష్యరహితమైన పర్యావరణానికి...
కేంద్రం కొత్తగా ప్రారంభించిన‌ రూఫ్‌టాప్ సోలార్ పవర్ స్కీమ్ ఏమిటి? దీని వ‌ల్ల మ‌నకు ప్ర‌యోజ‌న‌మేంటి?

కేంద్రం కొత్తగా ప్రారంభించిన‌ రూఫ్‌టాప్ సోలార్ పవర్ స్కీమ్ ఏమిటి? దీని వ‌ల్ల మ‌నకు ప్ర‌యోజ‌న‌మేంటి?

Solar Energy
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ‌త సోమవారం 'ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన (Pradhan Mantri Suryodaya Yojana) ను ప్రకటించారు. ఇది ప్రభుత్వ పథకం. దీని కింద కోటి గృహాలకు రూఫ్‌టాప్ సౌర విద్యుత్ సిస్టంలు లభిస్తాయి.రూఫ్‌టాప్ సోలార్ పవర్ సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను ప్రోత్సహించడానికి ఇది మొదటి పథకం కాదు. 2014లోనే ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది, ఇది 2022 నాటికి 40,000 మెగావాట్లు (MW) లేదా 40 గిగావాట్ల (GW) సోలార్ ఎన‌ర్జీ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ప‌లు కార‌ణాల వ‌ల్ల ప్ర‌భుత్వం ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. దీంతో ప్రభుత్వం 2022 నుండి 2026 వరకు గడువును పొడిగించింది. అయితే కొత్తగా ప్రారంభించిన‌ ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన ప‌థ‌కం విజ‌య‌వంత‌మైతే 40 GW రూఫ్ టాప్ సోలార్ ప‌వ‌ర్ సామర్థ్యం లక్ష్యాన్ని చేరుకోవడం సుల‌భ‌త‌ర‌మ‌వుతుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ...
Solar Rooftop Subsidy |  సోలార్ రూఫ్‌టాప్ తో కరెంట్ బిల్ జీరో.. ఇంకా అదనపు ఆదాయం..? సబ్సిడీకి ఇలా అప్లై చేయాలి..

Solar Rooftop Subsidy | సోలార్ రూఫ్‌టాప్ తో కరెంట్ బిల్ జీరో.. ఇంకా అదనపు ఆదాయం..? సబ్సిడీకి ఇలా అప్లై చేయాలి..

Solar Energy
Solar Power | కరెంట్ కోతలను తప్పించుకోవడానికి మీ ఇంటికి సోలార్ పవర్ యూనిట్ (Solar Power Unit) ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? సోలార్ పవర్ యూనిట్ పై ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది. అయితే ఈ సోలార్ సిస్టమ్ ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వ సబ్సిడీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి. అనే అంశాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.. సోలార్ రూఫ్‌టాప్ సబ్సిడీని ఎవరు పొందవచ్చు? Solar Rooftop Subsidy : రెసిడెన్షియల్ సెక్టార్ గ్రిడ్-కనెక్ట్ చేయబడిన సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్ట్‌లకు మాత్రమే కేంద్రం ప్రభుత్వ ఆర్థిక సహాయం (CFA లేదా సబ్సిడీ) అందుబాటులో ఉంటుంది. ఇతర రంగాలకు ఉదా, ప్రభుత్వ, సంస్థాగత, సామాజిక, వాణిజ్య, పారిశ్రామిక మొదలైనవి. CFA అందుబాటులో లేదు.సోలార్ సబ్సిడీని పొందేందుకు వినియోగదారులు ఎంప్యానెల్డ్ విక్రేతల (డిస్కామ్‌ల ద్వారా) ద్వారా మాత్రమే సిస్టమ్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సోలార్ రూఫ...
Solar Park | సోలార్ పార్కుల అభివృద్ధిలో ఆ రెండు రాష్ట్రాలు టాప్..

Solar Park | సోలార్ పార్కుల అభివృద్ధిలో ఆ రెండు రాష్ట్రాలు టాప్..

Solar Energy
Solar park|దేశంలోని రెండు రాష్ట్రాలు.. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, "సోలార్ పార్కులు, అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ల అభివృద్ధి" పథకం లక్ష్యాలను అమలు చేయడంలో గణనీయమైన పురోగతిని సాధించాయి . 2023-24 నాటికి కనీసం 50 సోలార్ పార్కులను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో డిసెంబర్ 2014లో 20,000 మెగావాట్ల ప్రారంభ సామర్థ్యంతో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం మార్చి 2017లో 40,000 మెగావాట్లకు విస్తరించబడింది. పథకం లక్ష్యాలు వినియోగానికి సిద్ధంగా ఉన్న భూమి, ప్రసార మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీ (RE) డెవలపర్‌లను సులభతరం చేయడం ఈ పథకం ప్రాథమిక లక్ష్యం. అవసరమైన అన్ని చట్టబద్ధమైన అనుమతులు, ఆమోదాలను పొందడంతో పాటు భూమి, రోడ్లు, విద్యుత్ తరలింపు వ్యవస్థలు  నీటి సౌకర్యాల వంటి ముఖ్యమైన అంశాల అభివృద్ధి ఇందులో ఉంటుంది. దేశవ్యాప్తంగా యుటిలిటీ-స్కేల్ సోలార్ ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేయడంపై ఈ పథకం ద...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు