
Ethanol | ఇంధనంలో విప్లవాత్మక మార్పులు: పెట్రోల్‌కి E27, డీజిల్‌కి IBA మిశ్రమం
Ethanol E27 : పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుత 20% నుంచి 27%కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కొత్త ఇంధనాన్ని E27గా పిలవాలని నిర్ణయించంది. ఇంధనం కోసం కొత్త నిబంధనలను రూపొందించే బాధ్యత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)కి అప్పగించింది. TOI నివేదిక ప్రకారం, మొదటి విడత సంప్రదింపులు వచ్చే వారం జరగనున్నాయి.E27 పెట్రోల్, IBA డీజిల్కొత్త E27 పెట్రోల్‌కు అనుగుణంగా ఇంజిన్‌లను సవరించడం గురించి పరిశోధన నిర్వహించాలని భారతదేశ వాహన పరీక్ష, ధృవీకరణ సంస్థ ARAIని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కోరింది.అధికారుల బృందం త్వరలో ఒక నివేదికను సమర్పించనుంది. భారతదేశం క్లీనర్ మొబిలిటీ వైపు మొగ్గు చూపుతున్న సమయంలో, విదేశాల నుంచి ఇంధన దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్న క్రమంలో ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది.డీజిల్‌లో 10% ఐసోబుటనాల్ (IBA) మిశ్రమానికి ప్రభుత్వ...