ఆసక్తి రేపుతున్న MINI Cooper SE electric car
భారతీయ మార్కెట్‌లో త్వరలో విడుదల
MINI Cooper SE electric car : బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఎట్టకేలకు భారతీయ మార్కెట్లోకి తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ MINI కూపర్ SE ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును తన సోషల్ మీడియా వేదికలపై టీజ్ చేసింది. ఇది దేశంలో త్వరలో విడుదల కాబోతుందని సూచిస్తోంది. కంపెనీ అధికారిక ఇండియా వెబ్‌సైట్‌లోనూ ‘కమింగ్ సూన్’ ట్యాగ్‌తో కనిపిస్తోంది. కొత్త MINI కూపర్ SE మూడు-డోర్ల ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 2019 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడింది . ఇప్పుడు, దీనిని CBU-రూట్ ద్వారా భారతదేశానికి తీసుకకొస్తున్నారు.MINI కూపర్ SE అనేది త్రీ-డోర్ హ్యాచ్‌బ్యాక్ కారుకు సంబంధించిన ఎలక్ట్రిఫైడ్ వెర్షన్. ఈ కారు పెట్రోల్ వెర్షన్ కంటే 145 కిలోల ఎక్కువ బరువు ఉంటుంది. మృదువైన బాడీ ప్యానెల్‌తో, 'E' బ్యాడ్జ్‌తో ఆకర్షణీయంగా కనిస్...