Home » ఆస‌క్తి రేపుతున్న MINI Cooper SE electric car 

ఆస‌క్తి రేపుతున్న MINI Cooper SE electric car 

MINI-Cooper-SE-Electric
Spread the love

భార‌తీయ మార్కెట్‌లో త్వ‌ర‌లో విడుద‌ల

MINI Cooper SE electric car : బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఎట్టకేలకు భారతీయ మార్కెట్లోకి తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. కంపెనీ MINI కూపర్ SE ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును తన సోషల్ మీడియా వేదిక‌ల‌పై టీజ్ చేసింది. ఇది దేశంలో త్వరలో విడుదల కాబోతుందని సూచిస్తోంది. కంపెనీ అధికారిక ఇండియా వెబ్‌సైట్‌లోనూ ‘కమింగ్ సూన్’ ట్యాగ్‌తో క‌నిపిస్తోంది. కొత్త MINI కూపర్ SE మూడు-డోర్ల ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 2019 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడింది . ఇప్పుడు, దీనిని CBU-రూట్ ద్వారా భారతదేశానికి తీసుక‌కొస్తున్నారు.

MINI-Cooper-SE-Electric
MINI-Cooper-SE-Electric

MINI కూపర్ SE అనేది త్రీ-డోర్ హ్యాచ్‌బ్యాక్ కారుకు సంబంధించిన‌ ఎలక్ట్రిఫైడ్ వెర్షన్. ఈ కారు పెట్రోల్ వెర్షన్ కంటే 145 కిలోల ఎక్కువ బరువు ఉంటుంది. మృదువైన బాడీ ప్యానెల్‌తో, ‘E’ బ్యాడ్జ్‌తో ఆక‌ర్షణీయంగా క‌నిస్తోంది. ఇది కొత్త ఏరో-ఆప్టిమైజ్డ్ వీల్స్‌తో పాటు హ్యాచ్‌బ్యాక్ వెలుపల లోపలి భాగంలో కొత్త నియాన్ ఎల్లో యాక్సెంట్‌లను క‌లిగి ఉంది.

సింగిల్ చార్జిపై 233కి.మి రేంజ్‌

MINI Cooper SE electric car లో 32.6kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఒకే ఛార్జ్‌పై 233 కిలోమీటర్ల WLTP ధ్రువీకరించబడిన రేంజ్‌ని ఇస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడింది. ఇది 184 PS శక్తిని, 270 Nm గరిష్ట టార్క్‌ను జ‌న‌రేట్ చేస్తుంది. ఇది 0-100 kmph నుండి 7.3 సెకన్లలోనే అందుకుంటుంద‌ని కంపెనీ పేర్కొంది, అయితే ఈ కారు గరిష్ట వేగం 150 kmph. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును 11kW ఛార్జర్‌ని ఉపయోగించి 2.5 గంటల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అలాగే 50kW DC ఫాస్ట్ ఛార్జర్ కేవలం 35 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు చార్జ్ చేయ‌గ‌ల‌దు.

MINI ఇండియా ఇటీవల తన సోషల్ మీడియాలోMINI Cooper SE electric car  ను టీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ త్వరలో ఇండియాలో లాంచ్ చేయ‌నున్నార‌ని భావిస్తున్నారు. కంపెనీ మొదట ఈ ఎలక్ట్రిక్ కారును CBU-రూట్ ద్వారా భారతదేశానికి తీసుకువస్తుంది. ఆ తరువాత, తమిళనాడులోని BMW ఇండియా గ్రూప్ కు చెందిన తయారీ కేంద్రం వద్ద ఇది అసెంబుల్ చేయబడవచ్చు. కొత్త MINI కూపర్ SE భారతదేశంలో ఎక్స్-షోరూమ్ ఢిల్లీలో దాదాపు రూ.50 లక్షల వరకు ఉండవచ్చు. ఈ ధరతో ఇది భారతదేశంలో అత్యంత సరసమైన లగ్జరీ ఎలక్ట్రిక్ కారు అవుతుంది. ఈ కారు Mercedes-Benz EQC, జాగ్వార్ I-PACE, Audi e-tron త‌దిత‌ర కార్ల‌కు పోటీ ఇవ్వొచ్చు.

4 thoughts on “ఆస‌క్తి రేపుతున్న MINI Cooper SE electric car 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *