ఎర్రబంగారం జిగేల్.. వరంగల్ మార్కెట్‌లో రికార్డు ధర: క్వింటాల్ దేశీ మిర్చి ₹50,000 – Warangal Market Mirchi Price
Warangal Market Mirchi Price | వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ విడుదల చేసిన తాజా ధరల పట్టిక (Today Approximate Arrivals & Prices) ప్రకారం మార్కెట్‌లో ముఖ్యంగా మిర్చి కొనుగోళ్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మొత్తం 17,080 బస్తాలు వచ్చాయి. అధిక రాకలు ఉన్నప్పటికీ కొన్ని రకాల మిర్చికి గరిష్ఠ ధరలు నమోదవడం రైతులకు ఊరటనిస్తోంది. అయితే వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు దేశీ మిర్చి క్వింటాల్‌కు ₹50,000 ధర పలకడం మార్కెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్.
క్వింటాల్ మిర్చి ₹50,000!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలం పుల్లూరు పల్లి గ్రామానికి చెందిన రైతు ఎ. రవీందర్ రావు పండించిన దేశీ మిర్చి క్వింటాల్‌కు ఏకంగా ₹50,000 ధర దక్కించుకుంది. రవీందర్ రావు 9 బస్తాల మిర్చిని మార్కెట్‌కు తీసుకురాగా, అంబికా & కంపెనీ (Adti) ద్వారా శాంతి ఇండస్ట్రీస్ (Trader) ఈ రికార్డు ధరకు కొనుగోలు ...

