
రైతులకు శాటిలైట్ ఆధారిత ఏఐ టెక్నాలజీ – ముందస్తు హెచ్చరికలతో అధిక దిగుబడి – AI in Agriculture
పంట రోగ ముందస్తుగా నిర్ధారణతక్కువ కూలీ ఖర్చులురైతులకు ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యవసాయ శాఖ ‘కృషివాస్’ సంస్థతో కలిసి ఏఐ ఆధారిత శాటిలైట్ టెక్నాలజీ (AI in Agriculture) ని వినియోగించేందుకు ముందడుగు వేసింది. ఈ టెక్నాలజీతో రైతులు ఇప్పుడు మొబైల్ యాప్ (Krishivas App) ద్వారా తమ పంటల్లో తెగుళ్ళను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవచ్చు.కృషివాస్ సంస్థ ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) సచివాలయంలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ సంస్థ తయారు చేసిన ఏఐ టెక్నాలజీతో శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా ముందస్తుగానే పంటలకు వ్యాపించే చీడ పురుగులు, రసం పీల్చే పురుగులను గుర్తించి, వాటిని మొదట్లోనే నిరోధించేలా టెక్నాలజీ (Crop Disease Detection) గురించి మంత్రికి వివరించారు. అంతేకాకుండా పంట బయటకు కనిపించే వాటినే కాకు...