World Environmental Health Day : పర్యావరణ ఆరోగ్యానికి మనమేం చేస్తే మంచిది..?
World Environmental Health Day 2023: మన చుట్టూ ఉన్న వాతావరణం, మనం నివసించే ప్రదేశం, మనం తినే ఆహారం, మనం నివసించే పరిసరాలు మరియు మనం పీల్చే గాలి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మనం మన జీవన నాణ్యతను మెరుగుపరిచే ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడం చాలా ముఖ్యం. పర్యావరణ ఆరోగ్యంపైనే ప్రజారోగ్యం ఆధారపడి ఉంటుంది.ప్రపంచ మరణాలలో 24 శాతం, ప్రతి సంవత్సరం 13.7 మిలియన్ల మరణాలు పర్యావరణ కారకాల వల్ల సంభవిస్తున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పర్యావరణ సమస్యలతో లక్షలాది మంది అనారోగ్యంతో సతమతమవుతూ జీవిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోకపోతే భూగోళం జీవనానికి ప్రతికూలమైన గ్రహంగా మారుతుంది.ప్రతి సంవత్సరం, మానవులకు, పర్యావరణానికి మధ్య ఉన్న సంబంధంపై అవగాహన పెంచుకోవాడానికి ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం, ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని సెప్టెంబర్ 26 ...