
దీపావళి ధమాకా: టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్లు! Tata EV
Tata EV Offers 2025 | దీపావళి పండుగ సీజన్ సందర్భంగా టాటా మోటార్స్ తన మొత్తం EV లైనప్‌లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లను (Diwali Electric Car Discounts) ప్రకటించిన విషయం తెలిసిందే.. ఆఫర్లు అక్టోబర్ 21, 2025 వరకు అందుబాటులో ఉంటాయి. టాటా కర్వ్ EV అన్నింటికంటే ఎక్కువగా రూ.1.90 లక్షల వరకు డిస్కౌంట్ ఉంది. ఆ తరువాత పంచ్ EV, టియాగో EV ఉన్నాయి, హారియర్ EV, నెక్సాన్ EV సైతం ఆకర్షణీయ ఆఫర్‌లను పొందాయి. ఈ ప్రయోజనాలు MY2024 మరియు MY2025 స్టాక్‌లకు వర్తిస్తాయి. ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ పథకాలు, కార్పొరేట్ డిస్కౌంట్లు, టాటా లాయల్టీ బోనస్‌లు. గ్రీన్ ఇన్సెంటివ్‌లు ఉన్నాయి.
టాటా కర్వ్ EV: రూ. 1.90 లక్షల వరకు తగ్గింపు
ఈ నెలలో టాటా కర్వ్ ఈవీ అతిపెద్ద డిస్కౌంట్‌ను పొందుతుంది. మొత్తం రూ. 1.90 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో రూ. 70,000 గ్రీన్ బోనస్, రూ. 30,000 విలువైన ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ ప్రయోజనాలు, రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్లు, రూ. 50,000 విలువైన టాటా లాయల్టీ ప్రయోజనాలు ఉన్నాయి. రూ. 17.49 లక్షల నుంచి రూ. 21.99 లక్షల మధ్య ధర కలిగిన కర్వ్ ఈవీ 45kWh మరియు 55kWh బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉంది. ఇవి వరుసగా 430 కి.మీ, 502 కి.మీ సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తాయి. ఇది మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లతో పోటీపడుతుంది.
టాటా టియాగో EV:
టాటా ఈవీ లైనప్‌లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు టియాగో EV పై రూ.1.23 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. రూ.1.23 లక్షల వరకు ప్రయోజనాలతో లభిస్తుంది. ఆఫర్లలో రూ.70,000 గ్రీన్ బోనస్, రూ.30,000 విలువైన ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ ప్రయోజనాలు, అదనపు కార్పొరేట్, లాయల్టీ డిస్కౌంట్లు ఉన్నాయి. రూ.7.99 లక్షల నుంచి రూ.11.14 లక్షల వరకు ధర కలిగిన టియాగో EV 19.2kWh మరియు 24kWh బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. ఇది 221 కి.మీ, 275 కి.మీ రేంజ్‌లను అందిస్తుంది. ఈ కారు MG కామెట్ EV కి పోటీగా ఉంటుంది.
టాటా పంచ్ EV: రూ.1.23 లక్షల వరకు తగ్గింపు
పాపులర్ మోడల్ పంచ్ EV (Tata Punch EV) కూడా రూ.1.23 లక్షల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో రూ.60,000 గ్రీన్ బోనస్, రూ.40,000 వరకు ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ ప్రయోజనాలు, కార్పొరేట్, లాయల్టీ డిస్కౌంట్లు ఉన్నాయి. రూ.9.99 లక్షల నుంచి రూ.14.44 లక్షల మధ్య అందుబాటులో ఉన్న పంచ్ EV, MIDC-రేటెడ్ రేంజ్‌లతో 25kWh మరియు 35kWh బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తుంది, ఇది సిట్రోయెన్ eC3 కంటే పోటీగా ఉంటుంది.
టాటా నెక్సాన్ EV: రూ.90,000 వరకు తగ్గింపు
Tata Nexon EV Deals టాటా బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ SUV అయిన నెక్సాన్ EV ఈ నెలలో రూ.90,000 వరకు ప్రయోజనాలను పొందుతుంది. వీటిలో రూ.30,000 ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ ఆఫర్, రూ.10,000 విలువైన కార్పొరేట్ డిస్కౌంట్లు, రూ.50,000 వరకు లాయల్టీ బోనస్‌లు ఉన్నాయి. రూ.12.49 లక్షల నుండి రూ.17.49 లక్షల వరకు ధరలతో, నెక్సాన్ EV 30kWh మరియు 45kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది, ఇవి వరుసగా 275km, 489km పరిధిని అందిస్తాయి. ఇది MG విండ్సర్, మహీంద్రా XUV400 లతో పోటీపడుతుంది.
డిస్క్లైమర్ : డిస్కౌంట్ గణాంకాలు.. స్టాక్ లభ్యతను బట్టి మారుతూ ఉంటాయి. కొనుగోలుదారులు ఖచ్చితమైన వివరాలు, ధరల కోసం వారి స్థానిక డీలర్లను సంప్రదించాలి.