Tata Punch EV: టాటా మోటార్స్ తన ఈవీ విభాగం నుంచి తర్వాతి ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. 2024 జనవరి చివరి వారంలో టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారును భారత్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం.
Punch EVమార్కెట్ లో సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ కారుకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇది దేశంలోనే అత్యంత చవకైన ధరకు వస్తున్న ఎలక్ట్రిక్ SUV కారు అని చెప్పవచ్చు. కాగా సిట్రోయెన్ eC3 ప్రస్తుతం ఎక్స్ షోరూం ధర రూ.11.61 లక్షల నుంచి ప్రారంభమై రూ. 12.79 లక్షల వరకు ఉంటుంది. అయితే దీనికంటే తక్కువగా టాటా పంచ్ ఉంటుందని సమాచారం. దీని ఎక్స్ షోరూం ధర రూ.11 లక్షల లోపు విడుదల చేయాలని కంపెనీ భావిస్తుంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. టియాగో ఈవీలలో ఉన్న 24కే వాట్స్ యూనిట్ తో పోలిస్తే ఇది కాస్త పెద్ద బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంటుంది. అలాగే.. టాటా పంచ్ ఈవీలో ఛార్జింగ్ సాకెట్ ముందు భాగంలో పొందుపరిచారు. ఇందులో అలాయ్ వీల్స్ కూడా ఉండే అవకాశముంది. టాటా పంచ్ ఈవీ.. ఐసీఈ పంచ్ ఎల్ఈడీ హెడ్ లైట్లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్ లు, ఆర్కెడ్.ఈవీ (Arcade.ev) యాప్ సూట్ తో సహా కొన్ని అదనపు ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తున్నారు. టాటా నెక్సాన్, నెక్సాన్ ఈవీలో కనిపించిన విధంగా ప్రకాశవంతమైన టాటా మోటార్స్ లోగోతో కూడిన స్పోక్ స్టీరింగ్ వీల్ అందించే చాన్స్ ఉంది.
ఇక Tata Punch EV ఇంటీరియర్ విషయానికొస్తే క్యాబిన్ లోపలి భాగం అప్ డేట్ చేసిన నెక్సాన్ మాదిరిగానే 10.25-అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది.. దీంతో పాటు ఆపిల్ కార్ ప్లే, యాండ్రాయిడ్ ఆటో, కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ తో సహా అనేక ఆకట్టుకునే ఫీచర్లను పొందుపరిచే అవకాశముంది. టాటా పంచ్ ఈవీ ధర గురించి టాటా కంపెనీ ఎక్కడా ఎలాంటి సమాచారాన్ని వెలువరించలేదు. అయితే పెట్రోల్ తో నడిచే కారుతో పోలిస్తే ధర కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలతో సుమారు 350 కిలో మీటర్ల ప్రయాణం చేసే చాన్స్ ఉంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.