
Tata Nexon EV కొత్త వెర్షన్ !
40kWh బ్యాటరీ సామర్థ్యంతో అధిక రేంజ్
Tata Nexon EV : దేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు మరింత రేంజ్, పెరిగిన బ్యాటరీ సామర్థ్యంతో మనముందుకు రాబోతోంది. టాటా మోటార్స్ సంస్థ 2022 ప్రారంభంలో నెక్సాన్ ఎలక్ట్రిక్ కారును ఒక పెద్ద అప్‌గ్రేడ్‌కు సిద్ధం చేస్తోంది. ఇందులో 40kWh పెద్ద బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. Tata Nexon EV ఇప్పటికే భారతదేశంలోని EV మార్కెట్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. భారతదేశంలో విక్రయించే మొత్తం ఎలక్ట్రిక్ కార్లలో ఇది 60 శాతం వాటాను కలిగి ఉంది.
వినియోగదారుల ఆదరణ

Nexon EV విజయానికి కారణం.. ఈ కారు సరసమైన ‘ధర-శ్రేణి. ప్రస్తుత నెక్సాన్‌లో అతి చిన్న బ్యాటరీ (30.2kWh) ఉంది. దాని ఇతర కంపెనీ కార్లతో పోలిస్తే ఇది తక్కువ శ్రేణిని కలిగి ఉన్నప్పటికీ, ఇది చాలా చౌకగా లభిస్తోంది. ఇక్కడ దాని వాస్తవ రేంజ్ అంటే ఒక్కసారి చార్జి చేస్తే సుమారు 180 నుంచి 200km వరకు ప్రయాణించవచ్చు. తక్కువ రేంజ్ ఉండంతో దీనిని రెండవ లేదా మూడవ కారుగా ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా లాంగ్ డ్రైవ్ చేయడానికి అంతగా అనుకూలంగా ఉండడం లేదు. ఎక్కువగా సిటీలోనే ఉపయోగిస్తున్నారు,
హై రేంజ్ వెర్షన్ Tata Nexon EV ఎందుకంటే..
అయితే ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు క్రమంగా మెరుగుపడటంతో EVలు జనాదరణ పొందడం జరుగుతోంది. ఎలక్ట్రిక్ కార్ల యజమానులు నగర పరిమితులను దాటి రావడానికి ఇది కారణమవుతోంది. ఛార్జింగ్ పాయింట్‌లు ఇప్పటికీ చాలా దూరంలో ఉన్నాయి. ఇప్పటికే ఉన్న Nexon EV ఓనర్‌ల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ EVలలో అవుట్‌స్టేషన్ ట్రిప్‌ల కోసం పెరుగుతున్న ట్రెండ్‌ని సూచిస్తుంది. ఇదే టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ SUV యొక్క హై రేంజ్ వెర్షన్‌ను తయారు చేయడానికి ప్రేరేపించింది.
రాబోతున్న ఎక్కువ రేంజ్ ఇచ్చే కొత్త Nexon EV 40kWh సామర్థ్యంతో అప్‌గ్రేడ్ చేయబడిన బ్యాటరీ ప్యాక్‌ను కలగి ఉంటుంది. ఇది ప్రస్తుత మోడల్ 30.2kWh వెర్షన్ కంటే 30 శాతం బ్యాటరీ కెపాసిటిని పెంచారు. పెద్ద బ్యాటరీ కోసం కారులో కొన్ని మార్పులు తప్పడం లేదు. పెద్ద బ్యాటరీని అమర్చడానికి బూట్ స్పేస్ కొంత తగ్గుతుందని భావిస్తున్నారు. బరువు కూడా 100 కిలోల మేర పెరిగినట్లు తెలుస్తోంది.
400కి.మి రేంజ్..
అధిక సామర్థ్యం గల బ్యాటరీ అధికారిక టెస్ట్ రైడ్‌లో 400కిమీ కంటే ఎక్కువ పరిధి అందించింది. అదే సమయంలో బయటి రోడ్లపై ప్రయోగించినపుడు ఒకే ఛార్జ్‌పై 300-320కిమీ రేంజ్‌న ఆశించవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇదే రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్లు MG ZS EV, హ్యుందాయ్ కోనా EV లకు ఈ టాటా నెక్సాన్ ఈవీ గట్టి పోటీ ఇవ్వనుంది.
ధర పెరిగే అవకాశం..
కొత్త నెక్సాన్ EVకి మరో ప్రధాన ఫీచర్ రీ-జెన్ మోడ్. ఇది రీజెనరేటివ్ బ్రేకింగ్ యొక్క తీవ్రతను సర్దుబాటు చేయడానికి డ్రైవర్‌కు అవకాశం కల్పిస్తుంది. ఇది క్రమంగా కారు పరిధిని మెరుగుపరుస్తుంది. ఇప్పుడున్న నెక్సాన్ EVలో రీజెన్ అడ్జెస్ట్‌మెంట్ లేదు. ఈ పెద్ద బ్యాటరీతో సహా ఇతర అప్‌గ్రేడ్‌ల కారణంగా నెక్సాన్ ఈవీ ధర రూ.3 లక్షల-4 లక్షల వరకు పెంచుతుందని భావిస్తున్నారు. అంటే దాదాపు రూ.17 లక్షల-18 లక్షల అంచనా ధరతో నెక్సాన్ EV రాబోతోందని తెలుస్తోంది.
దూకుడు వ్యూహం..
ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన ఆధికత్యను ప్రదర్శించడానికి టాటా మోటార్స్ దూకుడగా వ్యవహరిస్తోంది. కంపెనీ ఇటీవల తన కొత్త EV సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో 11-15 శాతం వాటా కోసం పెట్టుబడి సంస్థల నుండి రూ.7,500 కోట్లను సేకరించింది. ఈ కొత్త అనుబంధ సంస్థ, రూ. 700 కోట్ల మూలధనంతో రూపొందించబడింది.
మరిన్ని అప్‌డేట్‌ల కోసం హరితమిత్ర వెబ్‌సైట్‌ను సందర్శించండి.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన వీడియోల కోసం మా Haritha mithra YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి..!
3 thoughts on “Tata Nexon EV కొత్త వెర్షన్ !”