Tata Punch EV

Tata Punch EV త్వరలో ఇండియాలో విడుదల కానుందా? 

Spread the love

టాటా మోటార్స్ భారత EV మార్కెట్లో గట్టి పోటీనివ్వడానికి  సిద్ధమవుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో  టాటా కంపెనీ ఎలక్ట్రిక్ కారు Tiago EVని ప్రవేశపెట్టింది. తర్వాత, కంపెనీ ఇప్పుడు 2023 మధ్య నాటికి Tata Punch ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌ను విడుదల చేస్తోంది. టాటా పంచ్ EV ఇటీవల భారతదేశంలో మొదటిసారిగా రోడ్లపై పరీక్షిస్తున్నట్లు గుర్తించారు.

రాబోయే టాటా పంచ్ EV చాలా వరకు దాని ICE కౌంటర్‌పార్ట్‌ను పోలి ఉంటుంది. ఇది విలక్షణమైన ఎలక్ట్రిఫైడ్ అప్పీల్‌ని ఇస్తుంది. పంచ్ ఎలక్ట్రిక్ SUV దాని పెట్రోల్ వెర్షన్‌ల కంటే ఎక్కువ ఫీచర్లు ఉంటాయని అలాగే, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, మరెన్నో ఫీచర్లు లభిస్తాయని మీడియాలో వస్తున్న ఫొటోలను బట్టి తెలుస్తోంది.

Tata Punch EV బ్యాటరీ- పరిధి- పనితీరు

Punch EV 25 kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 250 నుంచి 300 కిమీల డ్రైవింగ్ రేంజ్‌ని అందజేస్తుందని భావిస్తున్నారు. ఇది ALFA ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన టాటా మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. పనితీరు పరంగా, దాని ఎలక్ట్రిక్ మోటార్ దాదాపు 60 bhp జనరేట్ చెందుతుందని ఆశించవచ్చు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

టాటా పంచ్ EV: ధర

రాబోయే పంచ్ EV టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్‌ఫోలియోలో టియాగో, నెక్సాన్ మధ్య స్లాట్ అవుతుంది. దీని ఎక్స్-షోరూమ్‌ ధర రూ. 9.50 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు  ఉండవచ్చని అంచనా. టాటా పంచ్ EV Citroen eC3, Tata Nexon EV ప్రైమ్ మొదలైన వాటితో పోటీ పడనుంది.

మరిన్ని అప్‌డేట్‌ల కోసం  హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

More From Author

Ola Electric Experience Centre

500వ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించిన ఓలా

Simple One  Electric Scooter

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *