Home » Tata Punch EV : టాటా పంచ్​ ఈవీ బుకింగ్స్​ ప్రారంభం.. 5 వేరియంట్లు- ఫీచర్లు ​ఇవే!

Tata Punch EV : టాటా పంచ్​ ఈవీ బుకింగ్స్​ ప్రారంభం.. 5 వేరియంట్లు- ఫీచర్లు ​ఇవే!

Tata Punch EV price
Spread the love

Tata Punch EV price in India : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ​ టాటా పంచ్​ ఈవీని రివీల్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ  టాటా మోటార్స్​. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ ను త్వరలోనే లాంచ్​ చేయనుంది.  ఇక ఇప్పుడు పంచ్ ev మోడల్​ బుకింగ్స్​ కూడా ప్రారంభమయ్యాయి. రూ. 21వేల టోకెన్​ మొత్తం​తో సంస్థకు చెందిన అధికారిక వెబ్​సైట్​ లేదా డీలర్​షిప్​ షోరూమ్స్​లో ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని సులభంగా బుక్​ చేసుకోవచ్చు. ఒకవేళ బుకింగ్ ని క్యాన్సిల్​ చేసుకున్నా..  ఆ డబ్బులు 3, 4 రోజుల్లో వచ్చేస్తాయి. . అయితే.. బుకింగ్స్​ మొదలైన సందర్బంగా టాటా పంచ్​ ఈవీ వేరియంట్లు, వాటికి సంబంధించిన కీలక ఫీచర్స్​ వెళ్లడయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాము..

టాటా పంచ్​ ఈవీ వేరియంట్లు- వాటి ఫీచర్స్​..

టాటా పంచ్ ఈవీ​ ఎలక్ట్రిక్​ వెహికిల్​లో మొత్తం 5 వేరియంట్లు ఉన్నాయి. అవి..

1.స్మార్ట్​,
2.స్మార్ట్​+
3.అడ్వెంచర్​
4.ఎంపవర్డ్​,
5.ఎంపవరడ్​+

టాటా పంచ్​ ఈవీ.. 4 మోనోటోన్​, 5 డ్యూయెల్​ టోన్​ ఎక్స్​టీరియర్​ కలర్స్​లో అందుబాటులో ఉంటుంది.. మోనోటోన్​ షేడ్స్​ అంటే.. సీవుడ్​ గ్రీన్​, డేటోనా గ్రే, ఫియర్​లెస్​ రెడ్​, ప్రిస్టీన్​ వైట్​.. ఇప్పుడు ఒక్కో వేరియంట్​తో పాటు దానిలోని ఫీచర్స్​ ను  తెలుసుకుందాము..

Tata Punch EV variants :

టాటా పంచ్​ ఈవీ స్మార్ట్​: కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ బేస్​ వేరియంట్​ స్మార్ట్. ఇందులో ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, స్మార్ట్​ డిజిటల్​ ఎల్​ఈడీ డే టైమ్​ రన్నింగ్​ లైట్స్​ వంటివి ఉన్నాయి.. ఇందులో మల్టీ- మోడ్​ రీజనరేటివ్​ బ్రేకింగ్​ సిస్టమ్ ​ కూడా లభిస్తుంది.. ఇక సేఫ్టీ విషయానికొస్తే.. ఈ ఎస్​యూవీలో 6 ఎయిర్​బ్యాగ్స్​తో పాటు ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ ప్రోగ్రాం (ఈఎస్​పీ) వంటి ఫీచర్లు ​ ఉంటాయి.

టాటా పంచ్​ ఈవీ అడ్వెంచర్​:

ఇందులో స్మార్ట్​ వేరియంట్​లో ఉన్న ఫీచర్స్​తో పాటు.. ముందు ఫాగ్​ ల్యాంప్స్​, ఆప్షనల్​ సన్​రూఫ్​, క్రూజ్​ కంట్రోల్​, 17.78 సెంటీమీటర్​ హర్మన్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టం​, ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే కనెక్టివిటీ ఫీచర్స్ లభిస్తున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్​ పార్కింగ్​ బ్రేక్​, ఆటో హోల్డ్​ ఫంక్షన్​ కూడా వస్తున్నాయి.

Tata Punch EV on road price Hyderabad : టాటా పంచ్​ ఈవీ- ఎంపవర్డ్​:- ఇది మిడిల్ ​ రేంజ్​ వేరియంట్​. ఇందులో అడ్వెంచర్​ వేరియంట్​లోని ఫీచర్స్​తో పాటు అదనంగా డ్యూయెల్​ టోన్​ ఎక్స్​టీరియర్​ పెయింట్​, 16 ఇంచ్​ డైమండ్​ కట్​ అలాయ్​ వీల్స్​, ఎయిర్​ ప్యూరిఫయర్​ విత్​ ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​, 17.78 సెంటీమీటర్​ డిజిటల్​ కాక్​ పిట్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 26.03 సెంటీమీటర్​ హర్మాన్​ టచ్​స్క్రీన్​ హెచ్​డీ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టం. వంటివి లభిస్తున్నాయి. ఆటో ఫోల్డ్​ ఓఆర్​ వీఎం, ఆప్షనల్​ సన్​రూఫ్​, ఎస్​ఓఎస్​ ఫీచర్స్​ కూడా ఉంటాయి.

టాటా పంచ్ ఈవీ-​ ఎంపవర్డ్​+ :  ఇది టాటా పంచ్​ ఈవీ హై ​ ఎండ్​ వేరియంట్​. ఇందులో లెథరేట్​ సీట్స్​, వయర్​లెస్​ స్మార్ట్​ఫోన్​ ఛార్జర్​, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్లు 26.03 ఇంచ్​ డిజిటల్​ కాక్​పిట్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, ఆర్కేడ్​. ఈవీ యాడ్​ సూట్​ వంటివి లభిస్తున్నాయి.. బ్లైండ్​ స్పాట్​ వ్యూ మానిటర్​, 360 డిగ్రీ కెమెరా సెటప్​ కూడా ఉంటుంది.

టాటా పంచ్​ ఈవీ ధర ఎంత..?

Tata Punch EV launch date in India : టాటా పంచ్​ ఈవీని సరికొత్త ప్లాట్​ఫామ్​పై రూపొందిస్తున్నది.. ఈ ప్లాట్​ఫామ్​లో సింగిల్ చార్జి పై రేంజ్​ 300 కి.మీలు- 600కి.మీల మధ్యలో ఉంటుంది. ఇక టాటా పంచ్​ ఈవీ ధరకు సంబంధించిన వివరాలను ప్రస్తుతం కంపెనీ వెల్లడించలేదు  అయితే.. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 12లక్షలు- నుంచి రూ. 14లక్షల మధ్యలో ఉండొచ్చని తెలుస్తుంది.​


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

One thought on “Tata Punch EV : టాటా పంచ్​ ఈవీ బుకింగ్స్​ ప్రారంభం.. 5 వేరియంట్లు- ఫీచర్లు ​ఇవే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *