Hyderabad : సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ అందించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ములుగు జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీకి భూకేటాయింపుపైనా నిర్ణయం తీసుకుంది. ఎకరానికి రూ.250 చొప్పున భూమి కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. అలాగే ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
రుణమాఫీ, రైతుభరోసాపై చర్చ
ఇదిలాఉండగా.. ఈ మంత్రి వర్గ సమావేశంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైనా చర్చించినట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్ని అమలయ్యాయి.. ఇంకా ఎలాంటి హామీలు నెరవార్చాలి అనేదానిపై చర్చించారు. అలాగే పలు హామీలు నెరవేర్చేందుకు ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీలు సమర్పించిన నివేదికలపై కేబినెట్ చర్చించింది. మరోవైపు రుణమాఫీ, రైతుభరోసా అమలుపై కూడా చర్చించినట్లు సమాచారం. అలాగే సాంకేతిక కారణాలతో ఆగిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధకారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..