New TVS EV | TVS మార్చి 2025 నాటికి మరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ బ్రాండ్ ఇప్పటికే ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో మొత్తం 1.27 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది, దీని ద్వారా రూ. 1,600 కోట్ల విలువైన ఆదాయాన్ని ఆర్జించింది.
New TVS EV: టీవీఎస్ మోటార్స్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోందనిTVS మోటార్ డైరెక్టర్, CEO, KN రాధాకృష్ణన్ ఇటీవల ప్రకటించారు. కొత్త ఉత్పత్తి శ్రేణి కోసం ప్లాన్ చేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు మరికొన్ని లాంచ్‌లను చూస్తారని ఆయన వెల్లడించారు. అది ఈ ఆర్థిక సంవత్సరంలోనే వస్తుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్రవేశాలు.. ఇప్పటికీ సింగిల్ డిజిట్‌లో ఉండడంతో వాహన తయారీదారులు ఈ విభాగంలో అభివృద్ధి అవకాశాలను చూస్తున్నారని తెలిపారు. అయితే రాధాకృష్ణన్.. టీవీఎస్ కొత్త స్కూటర్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించలేదు, అయితే ఇది కొత్త విభాగంలో ఉంటుందని చెప్పారు.”మేము కొత్త వాహనాల లాంచ్‌లకు సమయం ఇస్తున్నాము. మేము పరిశ్రమలో అన్నింటి కంటే ముందు ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.
దేశంలో Ola ఎలక్ట్రిక్ తర్వాత TVS మోటార్ అమ్మకాల పరంగా రెండవ అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీగా అవతరించింది. టీవీఎస్ iQube వాహనాలకు మార్కెట్ లో భారీగా డిమాండ్ ఉంది. ఈ ఏడాది ఆగస్టులో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల అమ్మకాల్లో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. అయితే సెప్టెంబరులో మాత్రం బజాజ్ ఆటో.. TVS మోటార్ ను అదిగమించింది మూడో స్థానం నుంచి రెండోస్థానానికి ఎగబాకింది. బజాజ్ ఆటో కు చెందిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు TVS iQube కంటే ఎక్కువ అమ్ముడయ్యాయి. ఈ రెండు కంపెనీల కారణంగా ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాల్లో భారీ క్షీణతను చవిచూసింది.
TVS iQube శ్రేణి 2.2 kWh, 3.4 kWh మరియు 5.1kWh బ్యాటరీ సామర్థ్యాలతో ఐదు వేరియంట్‌లను కలిగి ఉంది. వీటి ధర రూ. 94,999 నుంచి రూ. 1.85 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉంది. iQube కాకుండా, కంపెనీ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా కలిగి ఉంది దానిపేరు.. TVS X – అయితే ఇది ఇంకా మన రోడ్లపైకి రాలేదు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..