New TVS EV

TVS iQube EV Scooter | పెట్రోల్ స్కూటర్లను తలదన్నేలా.. టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ స్కూట‌ర్..

Spread the love

TVS iQube EV Scooter  | టీవీఎస్‌ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ చూడ‌డానికి ఇది సాధారణ స్కూటర్ మాదిరిగా కనిపిస్తుంది. కానీ ఇది ఆక‌ట్ట‌కునే ఫీచ‌ర్ల‌ను ఇందులో చూడ‌వ‌చ్చు. మొత్తం పనితీరు కూడా చాలా బాగుంటుంది. ఈ ఇ-స్కూటర్ గరిష్టంగా 80kmph వేగంతో, మ‌ల్టీ రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ స్కూటర్ ఎక్స్ షోరూం ధరలు

  • TVS iQube 2.2 kWh రూ. 1,17,630.
  • TVS iQube Standard రూ.1,46,996,
  • TVS iQube S – 3.4 kWh రూ.1,56,788,
  • TVS iQube ST – 3.4 kWh రూ.1,65,905
  • TVS iQube ST – 5.1 kWh రూ.1,85,729

TVS iQube ఈవీ స్కూట‌ర్‌ 5 వేరియంట్లు, 12 రంగులలో అందుబాటులో ఉంది. TVS iQube దాని మోటార్ నుంచి 3 W శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ముందు వైపు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లతో, TVS iQube కాంబీ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

TVS భారతదేశంలో iQube ఎలక్ట్రిక్ స్కూటర్ అప్ డేట్ చేసిన శ్రేణిని ప్రారంభించింది. ఇప్పుడు కొనుగోలుదారులు ఎంచుకోవడానికి ఐదు వేరియంట్లు ఉన్నాయి. ఈ మోడల్‌లు వేరియంట్‌ల పరంగా విభిన్నంగా ఉంటాయి. వాటి బ్యాటరీ కెపాసిటీలను బట్టి రేంజ్, ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

TVS iQube బేస్ మోడల్ రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. అందులో మొదటిది 2.2kWh, రెండోది 3.4kWh. ఈ రెండు మోడళ్లలో ది 4kW మోటార్ ఉంటుంది. చిన్న బ్యాటరీ ప్యాక్ తో సింగిల్ చార్జిపై 75kmph మైలేజీ ఇస్తుంది. గంట‌కు 75km వేగంతో ప్ర‌యాణిస్తుంది. అదే సమయంలో 3.4kWh ట్రిమ్ 78kmph వేగంతో వెళ్తుంది. సింగిల్ చార్జికి 100km రేంజ్ ఇస్తుంది. చిన్న బ్యాటరీ ఫుల్ చార్జి కావ‌డానికి కేవ‌లం రెండు గంటల సమయం పడుతుంది, ఇక పెద్ద‌యూనిట్ నాలుగు గంటల 30 నిమిషాల్లో ఫుల్ చార్జి చేస్తుంది. కాబట్టి ఇవి వాటి ఛార్జింగ్ స‌మ‌యం వేరువేరుగా ఉంటాయ‌ని ఉంటాయి.

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు

TVS iQube బేస్ మోడల్ ఫుల్‌ LED హెడ్‌ లైట్‌, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో ఐదు అంగుళాల TFT, OTA అప్‌డేట్‌లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/SMS అల‌ర్ట్‌, పార్క్ అసిస్ట్ వంటి స్మార్ట్ ఫీచ‌ర్లు ఉంటాయి. , ఇది ఎకానమీ మరియు పవర్ అనే రెండు రైడ్ మోడ్‌లతో వస్తుంది. అంతేకాకుండా ఇందులో జియో-ఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్, లైవ్ ఇండికేటర్ స్టేటస్, క్రాష్ అండ్ ఫాల్ అలర్ట్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ఉన్నాయి.

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్‌

ఇక టీవీఎస్‌ iQube S వేరియంట్ లో 3.4kWh బ్యాటరీని వినియోగించింది. ఇది 4.4kW మోటార్‌కి లింక్ చేసి ఉంటుంది. ఈ సెటప్ TVS iQube S 100km రేంజ్‌, 78kmph గరిష్ట వేగాన్ని అందిస్తుంది. దీని మొత్తం ఛార్జింగ్ సమయం నాలుగు గంటల 30 నిమిషాలు. ఈ స్కూటర్‌లోని ఫీచర్లలో ఏడు అంగుళాల TFT స్క్రీన్, ఆప్ష‌న్స్ ను నావిగేట్ చేయ‌డానికి HMI జాయ్‌స్టిక్ ఉంటుంది.

iQube ST వేరియంట్‌

iQube ST అనేది టాప్-స్పెక్ మోడల్. ఇది రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లతో కొనుగోలు చేయవచ్చు అవి మొద‌టిది 3.4kWh రెండోది 5.1kWh. ఇవి 4.4kW మోటార్‌కి క‌నెక్ట్ చేసి ఉంటాయి. ST 3.4kWh చిన్న బ్యాటరీ ప్యాక్ 100km రేంజ్ ఇస్తుంది. ఇది గంట‌కు 78kmph వేగంతో దూసుకుపోతుంది. అదే సమయంలో, 5.1kWh బ్యాట‌రీ ట్రిమ్‌ వేరియంట్‌ మీకు 150కిమీ రేంజ్‌, 82కిమీల గరిష్ట వేగాన్ని అందజేస్తుంది.

ఇక ఫీచ‌ర్ల విష‌యానికొస్తే iQube ST వేరియంట్లు టచ్‌స్క్రీన్ ఏడు-అంగుళాల TFT, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/SMS నోటిఫికేషన్‌లు, డాక్యుమెంట్ స్టోరేజ్, మ్యూజిక్ కంట్రోల్, సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు, నాలుగు క్లస్టర్ థీమ్‌లు, OTA అప్‌డేట్‌లు వంటి అన్ని స్మార్ట్‌ ఫీచర్లను ప్యాక్ చేస్తుంది. TVS iQube శ్రేణిలోని హార్డ్‌వేర్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ రియర్ షాక్‌లు, 90/90 టైర్లలో సెట్ చేయబడిన 12-అంగుళాల చక్రాలపై అమర్చబడిన 220mm ఫ్రంట్ డిస్క్, 130mm రియర్ డ్రమ్ బ్రేక్ ఉన్నాయి.

ఈ స్కూటర్లకు గట్టి పోటీ

TVS iQube EV Scooter బేస్ వేరియంట్‌ Ola S1X, Ather 450S లకు గ‌ట్టి పోటీనిస్తోంది. అయితే iQube S Ather 450X, Ola S1 ఎయిర్‌లకు పోటీగా ఉంది. ఆ తర్వాత, iQube ST ప్రత్యర్థులలో Ola S1 Pro, Ather Rizta ప్ర‌త్య‌ర్థిగా ఉంది. TVS iQube S నేటితరం స్టైలింగ్, మంచి ఫీచర్ల కలయిక, పనితీరు, మధ్య మంచి బ్యాలెన్స్ అందించే ఈవీస్కూట‌ర్‌గా నిలిచింది. మీరు దాని ICE పెట్రోల్ స్కూట‌ర్లతో పోల్చినప్పుడు కూడా నాణ్యత, సౌండ్ ఇంజనీరింగ్, రైడ్ సౌకర్యం, ప్రాక్టికాలిటీని బ‌ట్టి కూడా ఇది అద్భ‌తమైన ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

More From Author

Best CNG Cars

Best CNG Cars | త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే అత్యుత్త‌మ ఈ CNG కార్లు ఇవే..

Bajaj Chetak 2903

Bajaj Chetak 2903 | బజాజ్ నుంచి 123కిమీ మైలేజీ ఇచ్చే మరో కొత్త ఈవీ స్కూటర్ వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest

BIRC 2025 : 26 దేశాలకు భారత బియ్యం ఎగుమతి

పాకిస్తాన్‌, థాయిలాండ్‌ ఆధిపత్యానికి సవాలు న్యూఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 25: భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులను పెంచేందుకు జపాన్‌, ఇండోనేషియా, సౌదీ అరేబియా సహా 26 దేశాలను ఎంపిక చేసింది. వీటికి గ్లోబ‌ల్ ఇండెక్స్‌ (GI) గుర్తింపు పొందిన బియ్యం ఎగుమతి చేయనుంది. ఈ ప్రణాళికతో ₹1.8 లక్షల కోట్ల...