TVS iQube ST | టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త బేస్ వేరియంట్‌ను దేశంలో విడుదల చేసింది. కొత్త బేస్ వేరియంట్ 2.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 94,999 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. మరొక కీలక అంశమేమింటంటే.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న TVS iQube టాప్-వేరియంట్ ఎట్టకేలకు డెలివరీలను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది.
అయితే TVS iQube ST వేరియంట్ ఇప్పుడు . 3.4 kWh, 5.1 kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మొత్తంమీద, iQube శ్రేణి ఇప్పుడు మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇవి భారతదేశంలోని 434 నగరాల్లో విక్రయానికి సిద్ధంటగా ఉన్నాయి. .
TVS iQube బేస్ వేరియంట్: స్పెక్స్ & ఫీచర్లు
TVS iQube కొత్త బేస్ వేరియంట్ లో 4.4kW హబ్-మౌంటెడ్ BLDC మోటార్ ను వినియోగించారు. ఇది 140 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 2.2 kWh బ్యాటరీ నుంచి శక్తిని పొందుతుంది. సింగిల్ చార్జిపై ఎకో మోడ్‌లో 75 కిమీ, పవర్ మోడ్‌లో 60 కిమీల వరకు మైలేజీ ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి ఈ బ్యాటరీ కేవలం 2 గంటల్లోనే 0 నుండి 80% వరకు చార్జ్ చేయవచ్చు. ఈ వేరియంట్ రెండు కలర్ స్కీమ్‌లలో లభిస్తుంది. ఒకటి వాల్‌నట్ బ్రౌన్, రెండోది పెరల్ వైట్.
TVS iQube వేరియంట్లు | బ్యాటరీ ప్యాక్ | ఎక్స్-షోరూమ్ ధర |
స్టాండర్డ్ | 2.2 kWh | రూ. 94,999 |
స్టాండర్డ్ | 3.4 kWh | రూ.1.47 లక్షలు |
ఐక్యూబ్ ఎస్ | 3.4 kWh | రూ.1.57 లక్షలు |
iQube ST | 3.4 kWh | రూ.1.55 లక్షలు |
iQube ST | 5.1 kWh | రూ.1.85 లక్షలు |
టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ ధర రూ. 94,999 (ఎక్స్-షోరూమ్, బెంగళూరులో EMPS సబ్సిడీ మరియు క్యాష్‌బ్యాక్‌తో సహా) గా ఉంది. ఈ ప్రారంభ ధర 30 జూన్ 2024 వరకు మాత్రమే చెల్లుబాటవుతుంది. ఫీచర్ల పరంగా, iQube బేస్ వేరియంట్ 5-అంగుళాల రంగు TFT స్క్రీన్ కలిగి ఉంటుంది. ఛార్జర్, వెహికల్ క్రాష్ ఆటో అలర్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి సమాచారాన్ని అందిస్తుంది. ఇక ఇందులో బూట్ స్పేస్ 30-లీటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు.
కలర్ వేరియంట్స్..
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ టీ వేరియంట్ నాలుగు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంది.
- కాపర్ బ్రాంజ్ మ్యాట్,
- కోరల్ సాండ్ శాటిన్,
- టైటానియం గ్రే మ్యాట్
- స్టార్‌లైట్ బ్లూ.
TVS iQube ST: స్పెక్స్ & ఫీచర్లు
iQube ST రెండు బ్యాటరీ ఎంపికలలో అందుబాటులో ఉంది అవి. 3.4 kWh మరియు 5.1 kWh. దీని ధరలు వరుసగా రూ. 1.55 లక్షలు రూ. 1.85 లక్షలు (రెండూ ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ఇక మైలేజీ (రేంజ్) విషయానికొస్తే 3.4 kWh బ్యాటరీ గరిష్టంగా 78 kmphతో ప్రయణిస్తుంది. 100 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక 5.1 kWh మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిమీ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. ఇది గరిష్టంగా 82 kmph వేగంతో దూసుకుపోతుంది.
జూలై 15, 2022 లోపు ST వేరియంట్‌ను ప్రీ-బుక్ చేసిన కస్టమర్‌లు, రూ.10,000 లాయల్టీ బోనస్‌తో 5.1 kWh లేదా 3.4 kWh ST వేరియంట్‌ని కొనుగోలు చేయవచ్చు. బ్యాటరీ ప్యాక్‌తో పాటు, మిగిలిన అన్ని పీచర్లు ST వేరియంట్‌లకు సమానంగా ఉంటాయి. వీటిలో 7-అంగుళాల ఫుల్ కలర్ TFT టచ్‌స్క్రీన్, 118కి పైగా కనెక్ట్ చేయబడిన ఫీచర్లు, అలెక్సా ద్వారా వాయిస్ అసిస్ట్, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా iQube యూనిట్లను విక్రయించినట్లు TVS పేర్కొంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..
Super