స్విస్ EV కంపెనీని కొనుగోలు చేసిన TVS Motor

Spread the love

స్విట్జర్లాండ్ లోని అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన SEMG ని ఇండియాలోని ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం TVS Motor కొనుగోలు చేసింది. స్విస్ ఈ-మొబిలిటీ గ్రూప్ (SEMG)లో 75% వాటాను కొనుగోలు చేసినట్లు TVS మోటార్ కంపెనీ ప్రకటించింది. ఇటీవల నార్టన్ మోటార్‌సైకిల్స్, EGO మూవ్‌మెంట్‌తో సహా ప్రముఖ బ్రాండ్‌లను కొనుగోలు చేస్తూ ఐరోపాలో TVS మోటార్ కంపెనీ విస్త‌రించుకుటూ పోతోంది.

 

SEMG అనేది డ‌చ్ ప్రాంతంలో ఇ-మొబిలిటీ సొల్యూషన్‌ల యొక్క మార్కెట్-లీడింగ్ ప్రొవైడర్. స్విట్జర్లాండ్‌లో USD 100M ఆదాయంతో అతిపెద్ద ప్యూర్-ప్లే ఇ-బైక్ రిటైల్ చైన్ M-వే ని నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ప్రతిష్టాత్మకమైన స్విస్ మొబిలిటీ బ్రాండ్లను కలిగి ఉంది. ఇందులో సిలో, సింపెల్, అల్లెగ్రో, జెనిత్ వంటి బైక్‌లు ఉన్నాయి. SEMG సంస్థ‌కు విస్తృతమైన నెట్‌వర్క్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను, రెండు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, 31 ఆఫ్‌లైన్ స్టోర్‌లు ఉన్నాయి.

SEMG కంపెనీ కొనుగోలు గురించి TVS మోటార్ కంపెనీ చైర్మన్ శ్రీ వేణు శ్రీనివాసన్ మాట్లాడుతూ.. “TVS మోటార్ ఎల్లప్పుడూ స్థిరత్వానికి కట్టుబడి ఉంది. 10 సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాలపై పెట్టుబడి పెడుతోంద‌ని తెలిపారు.
టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్ సర్ రాల్ఫ్ స్పెత్ మాట్లాడుతూ “టీవీఎస్ మోటార్ ప్రపంచవ్యాప్తంగా ఇ-పర్సనల్ మొబిలిటీలో ముందంజలో ఉండేందుకు కృషి చేస్తోంద‌న్నారు. SEMG నార్టన్ మోటార్‌సైకిల్స్, EGO మూవ్‌మెంట్ యొక్క మా ల‌క్ష్య సాధ‌న‌కు సాయ‌ప‌డుతుంద‌ని తెలిపారు.

TVS మోటార్ కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సుదర్శన్ వేణు మాట్లాడుతూ “ఈ కొనుగోలు ఇ-పర్సనల్ మొబిలిటీ ఉత్పత్తుల ప‌ట్ల TVS Motor యొక్క నిబద్ధతను మరింతగా పెంచింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇ-బైక్‌ల విభాగంలో మేము మా ఉనికిని బలోపేతం చేస్తున్నాము. అని తెలిపారు.

కాగా టీవీఎస్ మోటార్స్ ఇప్ప‌టికే TVS iQube అనే హై స్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర‌ర్‌ను విడుద‌ల చేసింది.

TVS iQube

TVS iQube specifications

  • Continuous Power 3 KW
  •  Max Torque140 Nm
  • Drive Type Hub Motor
  • Motor Type BLDC
  • Motor Power 4.4 kW
  • Range75 km/charge
  • Range (Eco Mode)75 km/charge
  • Starting Push Button Start
  • Transmission Automatic
  • Battery Ip Rating IP67
  • City Mileage 83 km (Eco)
  • Top Speed78 kmph
  • Acceleration (0-40 Kmph)4.76s
  • Acceleration (0-60 Kmph)9.54s
  • Braking (60-0 Kmph)22.14m

మరిన్ని అప్‌డేట్‌ల కోసం హ‌రిత‌మిత్ర వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించిన వీడియోల కోసం మా  Haritha mithra YouTube ఛానెల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకోండి.!

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..