Ultraviolette నుంచి మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ పై 200km రేంజ్..

Spread the love

Ultraviolette new electric bike : ప్రముఖ ఈవీ సంస్థ అల్ట్రావయోలెట్​ సంస్థ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్​ బైక్​ మార్కెట్ లోకి సిద్ధమవుతోంది. మిలాన్​ వేదికగా ఈనెల 7న ప్రారంభంకానున్న ఈఐసీఎంఏ 2023 ఈవెంట్​లో.. సంస్థ ఈ ఎలక్ట్రిక్ బైక్​ ను ఆవిష్కరించనుంది ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం..

కొత్త బైక్​ వివరాలు ఇవీ ..

బెంగళూరుకు చెందిన అల్ట్రావయోలెట్​ సంస్థ.. తన ఎఫ్​77 ఎలక్ట్రిక్​ బైక్​తో ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకుంది. ఇక 2023 ఆటో ఎక్స్​పోలో కొత్త బైక్​కి సంబంధించిన కాన్సెప్ట్​ ను ఆవిష్కరించింది. తర్వాత.. ఈ బైక్​ ఎఫ్​99 గా కార్యరూపం దాల్చింది. ఇక త్వరలోనే మార్కెట్ లోకి రానున్న ఎలక్ట్రిక్​ బైక్​.. ఈ ఎఫ్​99 ఆధారంగా, రేసింగ్​ ప్లాట్​ఫామ్​పై రూపొందించినట్టు కనిపిస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ మోడల్​ పేరును సంస్థ రివీల్​ చేయలేదు..

Ultraviolette E-bike : కొత్త ఈ-బైక్​కి సంబంధించిన టీజర్​ను కంపెనీ విడుదల చేసింది అల్ట్రావయోలెట్​. ఎఫ్​77తో పోల్చుకుంటే, దీని డిజైన్​ చాలా డిఫరెంట్​గా ఉందనే చెప్పుకోవాలి. బైక్​కి హెడ్ ​ల్యాంప్​ లేదు. సైడ్​ ప్యానెల్​ షార్ప్​ గా, బోల్డ్​గా మారింది. టీఎఫ్​టీ డిస్​ప్లే కూడా ఇందులో కనిపిస్తోంది.

అల్ట్రావయోలెట్​ ఈవీ స్టార్టప్​ సంస్థకు ప్రస్తుతం ఎఫ్​77 బైక్​ ఒక్కటే మార్కెట్​లో ఉంది. ఇందులోని బేస్​ వేరియంట్​లో 7.1 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీనిటాప్​ స్పీడ్​ 152 కేఎంపీహెచ్​. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే..ఇది 207కి.మీల దూరం ప్రయాణిస్తుంది.

Ultraviolette new bike : ఇక త్వరలోనే అల్ట్రావయోలెట్​ నుంచి రాబోతున్న కొత్త ఎలక్ట్రిక్​ బైక్​లో.. ఎఫ్​77లో మించిన బ్యాటరీ ప్యాక్​ ఉంటుందని టాక్​ నడుస్తోంది. అంతేకాకుండా.. ఈ-బైక్​ టాప్​ స్పీడ్​ 195-200 కేఎంపీహెచ్​ మధ్యలో ఉండొచ్చని సమాచారం.

New electric bike : అల్ట్రావయోలెట్​ కొత్త ఎలక్ట్రిక్​ బైక్​కి సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. మిలాన్​ ఈవెంట్​లో ఈ మోడల్​ని సంస్థ ఆవిష్కరించిన తర్వాత.. ఫీచర్స్​, బ్యాటరీ, రేంజ్​పై ఓ క్లారిటీ వస్తుంది. ఇండియాలో ఈ మోడల్​ ఎప్పుడు లాంచ్​ అవుతుంది? అన్న విషయంపైనా త్వరలోనే ఓ క్లారిటీ రావొచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..