Harithamithra Telugu News

Home EV Updates E-scooters Joy e-bike: 6 నెలల్లో 100 కొత్త షోరూమ్‌లు.. విస్తరణ బాటలో Wardwizard

Joy e-bike: 6 నెలల్లో 100 కొత్త షోరూమ్‌లు.. విస్తరణ బాటలో Wardwizard

0
Joy e-bike showroom

Joy e-bike : ‘జాయ్ ఎలక్ట్రిక్ బైక్ లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Wardwizard Innovations & Mobility.. కేవలం 6 నెలల్లో భారతదేశమంతటా 100 కొత్త షోరూంలను ప్రారంభించింది. ఫలితంగా ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న టచ్ పాయింట్ల సంఖ్య 750కి చేరింది.

ప్రత్యేక డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌లు భారతదేశం అంతటా పశ్చిమాన మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉత్తరాన ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, జమ్మూ & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్.. అలాగే తూర్పున బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో షోరూంలను కలిగి ఉండగా దక్షిణాన తమిళనాడులో షోరూంలు ఉన్నాయి.

ఇటీవల ప్రారంభించిన Joy e-bike షోరూమ్‌లలో MIHOSతో సహా లో స్పీడ్, హైస్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. MIHOS అనేది పాలీ డైసైక్లోపెంటాడైన్ మెటీరియల్ (PDCPD)ని ఉపయోగించే హై-స్పీడ్ ఇ-స్కూటర్ అని కంపెనీ పేర్కొంది. ఇది రైడర్‌లకు అధిక మన్నిక, పనితీరును అందిస్తుంది.

కొత్త షోరూంల ప్రారంభోత్సవం సందర్బంగా వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ & మొబిలిటీ చైర్మన్, MD యతిన్ గుప్తే మాట్లాడుతూ.. “మా అత్యాధునిక
షోరూంలలో అసాధారణమైన విక్రయాలు, నాణ్యమైన సేవా వనరుల ద్వారా మా కస్టమర్‌లకు చక్కని అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము.” అని తెలిపారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Previous articleTata Avinya: టాటా నుంచి మరో అద్భుతం.. అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ కార్‌..
Next articleUltraviolette నుంచి మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ పై 200km రేంజ్..
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here