Home » Electric Scooters | త్వరలో విడుదల కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..

Electric Scooters | త్వరలో విడుదల కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..

honda activa electric scooters
Spread the love

Electric Scooters | భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరింత జనాదరణ పొందుతున్నాయి.. చాలా స్కూటర్లు అందుబాటు ధరలో ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, రాయితీలు, అలాగే పర్యావరణ అనుకూల రవాణాపై  పెరుగుతున్న అవగాహన డిమాండ్ కారణంగా.. అనేక ద్విచక్ర వాహన తయారీదారులు రాబోయే కొద్ది సంవత్సరాలలో తమ రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు.

FAME II సబ్సిడీల తగ్గింపుతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు మార్కెట్లో మరింత సరసమైన స్కూటర్‌లను విడుదల చేయాలని చూస్తున్నారు. ఇందులు ఉదాహరణగా ప్రముఖ ఈవీ కంపెనీ Ather Energy నుంచి  ఏథర్ 450S అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చిన్న బ్యాటరీ ప్యాక్, TFT స్క్రీన్ తో వస్తోంది. అలాగే Ola కూడా ఓలా S1X చిన్న బ్యాటరీ ప్యాక్‌ తో కొత్త మోడల్ మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. అయితే ఇదే దారిలో మరిన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు సిద్ధమయ్యాయి. హోండా, సుజుకి వంటి ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాల నుంచి కూడా కొన్ని Scooters రాబోతున్నాయి. భారతదేశంలో 2024లో రాబోయే సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు ఒకసారి చూద్దాం..

ఏథర్ Ather

  • ధరe: Rs 1.30 lakh [ అంచనా]
  • లాంచ్ తేదీ :  డిసెంబర్ 2024
  • రేంజ్: 115km/charge
  • గరిష్ట వేగం : 90 kmph

బెంగళూరుకు చెందిన EV తయారీదారు ఏథర్‌ కంపెనీ ఇటీవల ఫ్యామిలి ఎలక్టిక్ స్కూటర్‌ (Ather family scooter) ను పరీక్షించారు. ఇది  ప్రస్తుత ఏథర్ 450 శ్రేణి కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా చేసిన ట్వీట్ ప్రకారం, ఈ స్కూటర్ 2024 ప్రథమార్థంలో విడుదల చేయనున్నారు. ఇది భారతదేశంలో రాబోయే ఇతర స్కూటర్లలో TVS iQubeతో పోటీపడుతుంది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

సింపుల్ డాట్ వన్

Simple one
Simple one electric scooter

సింపుల్ ఎనర్జీ అనేది తమిళనాడులో ఉన్న మరొక స్టార్టప్.  ఈ కంపెనీ అత్యధిక రేంజ్ ని ఇచ్చే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు విడుదల చేసి సంచనం సృష్టించింది. దీని IDC పరిధి 212 కిలోమీటర్లు  కంపెనీ, దాని మొదటి స్కూటర్‌లో దాదాపు 50 యూనిట్లను డెలివరీ చేసింది. ఇప్పుడు దాని రెండో మోడల్ సింపుల్ డాట్ వన్‌ (Simple Dot One ) ను మరింత సరసమైన ధరలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. డాట్ వన్ లాంచ్ 2023 డిసెంబర్ 15న జరగనుంది.

హోండా యాక్టివా EV

honda activa electric scooter

  • ధర : రూ. 1.10 లక్షలు [అంచనా]
  • ప్రారంభ తేదీ : మార్చి 2024
  • పరిధి : 160-200 కి.మీ
  • గరిష్ట వేగం : 90-100 కి.మీ

TVS, Hero వంటి ప్రధాన ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీలు ఇప్పటికే EV స్పేస్‌లో ఉన్నందున, హోండా ఆలస్యమైనప్పటికీ యాక్టివా (Honda Activa Electric) చేసిన మ్యాజిక్‌ను పూర్తి-ఎలక్ట్రిక్ యాక్టివా లాంచ్‌తో మళ్లీ సృష్టించాలని భావిస్తోంది. 2024 ప్రారంభంలో ప్రారంభించబడుతుందని అంచనా వేస్తున్నారు. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ పోటీ ధరలో ఉంటుంది.

అయితే ఆ సమయంలో స్కూటర్ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

సుజుకి బర్గ్‌మాన్ ఎలక్ట్రిక్

suzuki burgman electric scooter

  • ధర : రూ. 1.20 లక్షలు [అంచనా]
  • ప్రారంభ తేదీ : ఏప్రిల్ 2024
  • పరిధి: 115కిమీ/ఛార్జ్
  • గరిష్ట వేగం: 90 kmph

హోండా ఒక EV విడుదల చేసి ఈవీ మార్కెట్లోకి అడుగు పెట్టడంతో సుజుకి కూడా బర్గ్‌మ్యాన్ (Suzuki Burgman Electric) స్కూటర్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ స్కూటర్ ఇప్పటికే భారతదేశంలో పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.  2024 మొదటి అర్ధ భాగంలో లాంచ్ జరుగుతుందని భావిస్తున్నారు. అయితే సుజుకి బర్గ్‌మ్యాన్ ఎలక్ట్రిక్ ధర రూ. 1 లక్ష, ఎక్స్-షోరూమ్ ధరను కలిగి ఉంటుందని సమాచారం..

ఇందులో టెలిస్కోపిక్ ఫోర్క్, డిస్క్ బ్రేక్, ముందువైపు 12-అంగుళాల అల్లాయ్ వీల్. వెనుకవైపు చిన్న చక్రంతో కూడిన ట్విన్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ మోటారు 110cc పెట్రోల్ స్కూటర్‌తో పోల్చదగిన 4kW శక్తిని అందించగలదని.. రోజువారీ ప్రయాణానికి అనువైన సుమారు 90km పరిధిని అందజేస్తుందని భావిస్తున్నారు.

LML స్టార్

lml star electric scooter

  • ధర : అంచనా 1.00 లక్షలు
  • ప్రారంభ తేదీ : మార్చి 2024
  • పరిధి: ఛార్జ్‌కి 120 kmph
  • గరిష్ట వేగం: 85 kmph

LML Star అనేది 4 kWh  వేరు చేయగల బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కి.మీ. ఈ మోటార్ గరిష్టంగా 6.8 PS పవర్ మరియు 38 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీని గరిష్ట వేగం గంటకు 85 కి.మీ. LML ఈ స్కూటర్‌ను మరో రెండు ఎలక్ట్రిక్ బైక్‌లతో పాటు భారతదేశంలో విడుదల చేస్తోంది. LML స్టార్ ఆధునిక రూపాన్ని,  పెద్ద పరిమాణాన్ని కలిగి ఉంది. ఇది  ప్రత్యేక స్క్రీన్‌ను కలిగి ఉంది. భద్రత కోసం, ఇది రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. LML స్టార్ ధర సుమారు రూ. 1 లక్ష. ఇది బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వంటి స్కూటర్లతో పోటీపడుతుంది. స్కూటర్ వేగవంతమైనది. ఫ్యాషన్ వీల్స్, స్పష్టమైన డిజిటల్ స్పీడోమీటర్ కలిగి ఉంటుంది. ట్యూబ్‌లెస్ టైర్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు… కృతజ్ఞతలు..

Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

2 thoughts on “Electric Scooters | త్వరలో విడుదల కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *