Roof Garden Urban Farming : నగరవాసులకు ఇంటి ఆవరణలోనే లేదా డాబాపై (Rooftop) విషరహిత, స్వచ్ఛమైన కూరగాయలను పండించుకునేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ సిద్ధమైంది. అర్బన్ ఫార్మింగ్ పథకంలో భాగంగా ‘ఇంటి ఆవాసాలపై కూరగాయల పెంపకం’ అనే అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉద్యాన శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.
శిక్షణ వివరాలు:
- తేదీ: జనవరి 25, 2026 (ఆదివారం)
- సమయం: ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు.
- రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 100/- మాత్రమే.
- వేదిక: రాష్ట్ర ఉద్యాన శిక్షణ కేంద్రం, పబ్లిక్ గార్డెన్స్ పక్కన, నాంపల్లి, హైదరాబాద్.
ఈ శిక్షణలో ఏం నేర్పిస్తారు?
- ఈ మూడు గంటల శిక్షణలో నిపుణులు కింది అంశాలపై అవగాహన కల్పిస్తారు:
- కుండీలు/గ్రో బ్యాగ్స్ తయారీ: తక్కువ స్థలంలో మొక్కలను ఎలా అమర్చుకోవాలి?
- మట్టి మిశ్రమం (Potting Mix): కోకోపిట్, వర్మీ కంపోస్ట్ మరియు మట్టిని సరైన నిష్పత్తిలో ఎలా కలపాలి?
- సేంద్రియ పద్ధతులు: రసాయన ఎరువులు లేకుండా వేప నూనె, జీవామృతం వంటి పద్ధతులతో పురుగుల నివారణ.
- సీజనల్ సాగు: ఏయే సీజన్లలో ఏయే కూరగాయలు వేస్తే దిగుబడి ఎక్కువగా వస్తుంది.
ఎందుకు పాల్గొనాలి?
ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే కూరగాయల్లో పురుగుల మందుల అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ శిక్షణ ద్వారా మీ ఇంట్లోనే టమోటా, పచ్చిమిర్చి, బెండకాయ, ఆకుకూరలు వంటి నిత్యవసరాలను సొంతంగా సాగు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తుంది.
ఆసక్తి గల వారు రూ.100/` ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు నాంపల్లిలోని రాష్ట్ర ఉద్యాన శిక్షణ కేంద్రంలో గాని లేదా 8977714411/8688848714 నెంబర్‌లలోగానీ సంప్రదించాలని ఉద్యాన శాఖ డైరెక్టర్ తెలిపారు.





