Vida V1 Plus: దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ విడ నుంచి మరో మోడల్ వీ 1 ప్లస్ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది. విడా ఎలక్ట్రిక్ వీ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత్ లో రూ. 97,800 ప్రారంభ ధరతో తీసుకువస్తూ.. మార్కెట్ లో మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
విడా వీ 1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్
Vida V1 Plus Electric scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో మార్కెట్ వాటాను పెంచుకునే లక్ష్యంతో వ్యూహాత్మకంగా విడా ఎలక్ట్రిక్ అధికారికంగా వీ 1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను సబ్సిడీల అనంతరం కేవలం రూ. 97,800 లకే అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారత మార్కెట్లో అత్యంత చౌకగా లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ వి 1 ప్లస్ అని చెబుతోంది.
100 కి.మీ రేంజ్
విడా వి1 ప్లస్ (Vida V1 Plus) స్కూటర్ లో 1.72 కిలోవాట్ల సామర్థ్యం గల రెండు రిమూవబుల్ బ్యాటరీలను కలిగి ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్ పరిధి 100 కిలోమీటర్లు, అలాగే, టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. ఈ ఇంజన్ గరిష్టంగా 6 కిలోవాట్ల శక్తిని, 25 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.. ఈ పూర్తి బ్యాటరీ ప్యాక్ ను 100% ఛార్జ్ అవడానికి 5 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటే పోర్టబుల్ చార్జర్ ను అందిస్తున్నారు.
5 ఏళ్ల వారంటీ..
ఇక వారంటీ విషయానికి వస్తే, విడా వీ 1 ప్లస్ (Vida V1 Plus) స్కూటర్.. 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీతో వస్తోంది. బ్యాటరీ ప్యాక్ పై 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ ఉంటుంది. ఈ స్కూటర్ కేవలం 3.4 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే విడా , వి 1 ప్లస్ లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ తో సహా ఆల్-ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ఉంది. ఇది రాత్రిపూట కూడా రైడ్ సమయంలో సరైన విజిబిలిటీని అందిస్తుంది.
ఈ విడా వీ 1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎకో, రైడ్, స్పోర్ట్ అనే మూడు విభిన్న మోడ్ లు ఉంటాయి.. ఈ బైక్ లో 7 అంగుళాల టీఎఫ్ టీ టచ్ స్క్రీన్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ను చూడవచ్చు. ఈ క్లస్టర్ తో ఇంటర్నెట్ ను. కనెక్ట్ కావచ్చు. జియోఫెన్సింగ్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్, వెహికల్ డయాగ్నోస్టిక్స్ వంటి ఫీచర్స్ ఉంటాయి.. అదనంగా, Vida V1 Plusలో అదనపు భద్రత కోసం ఎస్ఓఎస్ అలర్ట్ సిస్టమ్ కూడా ఉంది.
ఇంకా ఏమున్నాయి..?
ఇక సెక్యూరిటీ విషయానికొస్తే, వి1 ప్లస్ (Vida V1 Plus) లో యాంటీ-థెఫ్ట్ అలారం, ఫాలో-మీ-హోమ్ హెడ్ ల్యాంప్స్, కీ లెస్ ఎంట్రీ,.. ఎలక్ట్రానిక్ సీట్ అండ్ హ్యాండిల్ లాక్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్, రెజెన్ అసిస్ట్ కోసం టూ-వే థ్రోటిల్ ఉన్నాయి. బ్లూటూత్ సపోర్ట్ తో ఇన్ కమింగ్ కాల్ అలర్ట్ లను పొందవచ్చు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.
Excellent,