
భారత్ లో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. నవంబర్ 2024లో వచ్చిన ఓలా S1 Z, మరోవైపు జూలై 1, 2025న విడుదలైన Hero Vida VX2 వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు ఆకర్షణీయ ధరలతో హీటెక్కిస్తున్నాయి.
ధరలు & వేరియంట్లు ఇలా:
హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ GO, Plus అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. GO మోడల్ ధర ₹99,490 కాగా, బాటరీ-యాజ్-అ-సర్వీస్ (BaaS) ప్లాన్‌తో కేవలం ₹59,490కే కొనుగోలు చేయవచ్చు. ఇక Plus వేరియంట్ ₹1,09,990 (బ్యాటరీతో), లేదా ₹64,990 (BaaS)గా ఉంది.
మరోవైపు, ఓలా S1 Z రెండు ఎంపికల్లో వస్తోంది అందులో మొదటిది స్టాండర్డ్ (₹59,999) రెండోది Z+ (₹64,999). స్టాండర్డ్ వేరియంట్‌లో 1.5kWh రిమూవల్ బ్యాటరీ లభిస్తుంది. Z+ వేరియంట్‌కి పెద్ద డిస్‌ప్లే, అదనపు ఫీచర్లు ఉన్నాయి.
బ్యాటరీ, పరిధి, ఛార్జింగ్ – ఏది బెస్ట్ ?
హీరో విడా GO మోడల్ 2.2kWh బ్యాటరీతో 92 కిమీ వరకు రేంజ్ ఇస్తుంది. Plus వేరియంట్‌కి రెండు బ్యాటరీలు ఉండడంతో సింగిల్ చార్జిపై 142 కిమీ ప్రయాణిస్తుంది. వీటిలోని బ్యాటరీలను ఇంటి వద్దే సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే BaaS పథకం ద్వారా మార్పిడి చేసుకోవచ్చు.
ఓలా S1 Z మోడల్ ఒక 1.5kWh రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. రెండవ బ్యాటరీ కలిపితే రేంజ్ 146 కిమీ వరకు పెరుగుతుంది. ఛార్జింగ్‌కి ఓలా హైపర్‌నెట్‌వర్క్ సపోర్ట్ కూడా లభిస్తుంది.
సాంకేతికత మరియు లక్షణాలు
ఫీచర్ | హీరో విడా VX2 ప్లస్ | ఓలా S1 Z / Z+ |
---|---|---|
డిస్ల్పే | 4.3-అంగుళాల TFT | 12-అంగుళాలు (Z) / 14-అంగుళాల (Z+) LCD |
నావిగేషన్ & మీడియా | పరిమితం | స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ద్వారా లభిస్తుంది |
OTA అప్‌డేట్‌లు & యాప్ సపోర్ట్ | స్టాండర్డ్ | యాప్ ఇంటిగ్రేషన్‌తో విస్తృతమైన ఫీచర్లు |
ఫీచర్లు ఎవరిది ఎక్కువ?
Hero Vida VX2 బేసిక్ కాన్సోల్, స్టాండర్డ్ కనెక్టివిటీతో వస్తుంది. కస్టమర్లకు BaaS స్కీమ్ ద్వారా ఖర్చును తగ్గించుకునే సౌలభ్యం ఉంది. ఓలా S1 Z Z+ వేరియంట్ పెద్ద డిస్‌ప్లే, మ్యూజిక్ ప్లేయర్, నావిగేషన్, ఓటీఏ అప్‌డేట్లను అందిస్తుంది.
మోడల్ | బ్యాటరీ సెటప్ | పరిధి | అత్యధిక వేగం | 0–40 కి.మీ/గం త్వరణం |
---|---|---|---|---|
హీరో విడా VX2 గో | 2.2 kWh | 92 కి.మీ | గంటకు 70 కి.మీ. | 4.2 సెకన్లు |
హీరో విడా VX2 ప్లస్ | 3.4 kWh ( డ్యూయల్) | 142 కి.మీ | గంటకు 80 కి.మీ. | 3.1 సెకన్లు |
ఓలా S1 Z (1 బ్యాటరీ) | 1.5 kWh | 75 కి.మీ | గంటకు 70 కి.మీ. | ~4.7 సెకన్లు |
ఓలా S1 Z (2 బ్యాటరీలు) | 3 kWh | 146 కి.మీ | గంటకు 70 కి.మీ. | ~4.7 సెకన్లు |
రెండింటిలో ఏది ఉత్తమం ?
- తక్కువ ధరలో ఈవీ స్కూటర్ కావాలనుకునేవారికి – Ola S1 Z స్టాండర్డ్
- ఎక్కువ రేంజ్, ఫ్లెక్సిబిలిటీ కోరుకునేవారికి – Hero Vida VX2 Plus
- ఫీచర్లను ప్రాధాన్యంగా చూస్తే – Ola S1 Z+
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..