EICMA 2024లో Vida Z ఎలక్ట్రిక్ స్కూటర్‌ను Hero MotoCorp ఆవిష్కరించింది. ఈ స్కూటర్ తో యూరోపియన్ మార్కెట్‌లోకి హీరోమోటో కార్ప్ బ్రాండ్ ప్రవేశిస్తోంది. విడా జెడ్ స్కూటర్ గురించి Hero MotoCorp వివరాలను వెల్లడించనప్పటికీ, Vida Z భారతదేశంలో అందుబాటులో ఉన్న V1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధారంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది మినిమలిస్ట్ స్టైలింగ్‌తో ఆధునికంగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. దాని LED హెడ్‌ల్యాంప్‌ను V1తో మాదిరిగా ఉంది. స్కూటర్‌లో ఇంటిగ్రేటెడ్ బ్యాక్‌రెస్ట్‌తో కూడిన ఫ్లాట్ సీటు ను చూడవచ్చు.
Vida Z మాడ్యులర్ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉందని తెలుస్తుంది. 2.2 kWh నుండి 4.4 kWh వరకు మల్టీ బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఎలక్ట్రిక్ స్కూటర్ శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (PMSM) ద్వారా శక్తిని పొందుతుంది. అయితే, Vida V1 మాదిరిగానే , Z కూడా రిమూవబుల్ బ్యాటరీలను పొందుతుంది. బ్యాటరీ హెల్త్, వాహనాల చోరీ జియో-ఫెన్సింగ్, మరిన్నింటిని ట్రాక్ చేయడానికి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లను కలిగిన టచ్‌స్క్రీన్ TFT డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది..
హీరో మోటోకార్ప్ UK, యూరప్‌లో విక్రయించే మొదటి ఉత్పత్తి Vida Z. ప్రస్తుతం భారత్ లో Hero MotoCorp దాని పోర్ట్‌ఫోలియోలో Vida V1ని మాత్రమే విక్రయిస్తుంది, ఇది సుమారు రూ. 1 లక్ష ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభమవుతుంది. V1 ఇప్పుడు దేశవ్యాప్తంగా 100 నగరాలు, 150 డీలర్లలో అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో పెద్ద పీట వేయాలని చూస్తున్నందున ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో నాలుగు ఎలక్ట్రిక్ మోడళ్లను కలిగి ఉండాలని కంపెనీ యోచిస్తోంది.
2025-26 లో విడా శ్రేణిలో ఆరు మోడళ్లు, జీరో మోటార్స్‌తో నాలుగు మోడళ్లతో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల పోర్ట్‌ఫోలియోపై దృష్టి సారిస్తున్నట్లు ఆటోకార్ ప్రొఫెషనల్ నివేదించింది. Hero MotoCorp ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ గ్లోబల్ బిజినెస్, ఎలక్ట్రిక్ మొబిలిటీలో మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. అనేక సంప్రదాయ కంపెనీల వలె కాకుండా, Hero MotoCorp మొత్తం ఆదాయంలో ఎగుమతుల వాటా ఇప్పటికీ -సింగిల్ డిజిట్‌లో ఉంది. దాని వ్యాపారాన్ని మెరుగుపరచడానికి పటిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. హీరో మోటోకార్ప్ కంపెనీ 48 దేశాలలో విస్తరించి ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో దాని రూ. 37,456 కోట్ల ఆదాయంలో 3.9% ఎగుమతుల వాటాను కలిగి ఉంది.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..