ఫుల్ ఛార్జ్‌పై 530కి.మీ రేంజ్.. లాంచ్ ఎప్పుడంటే?
Volvo C40 Recharge SUV : ప్రముఖ వోల్వో కార్ ఇండియా (Volvo Car India) తన రెండో ఎలక్ట్రిక్ వాహనం (Volvo C40) రీఛార్జ్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV వచ్చే ఆగస్టులో భారత మార్కెట్లో విడుదల కానుంది. ఇక, ఈ కారు డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. వోల్వో XC40 రీఛార్జ్ అనే మరో ఎలక్ట్రిక్ SUVని కంపెనీ అందిస్తోంది. వోల్వో C40 రీఛార్జ్ అనేది ఒక ఎలక్ట్రిక్ (EV) వాహనం.
అంటే.. ఎలక్ట్రిక్ కారుగా గ్రౌండ్-అప్‌గా అభివృద్ధి చేసింది. మరోవైపు వోల్వో XC40 రీఛార్జ్ ఇంటర్నల్ కర్బన్ ఇంజిన్ (ICE) ప్రతిరూపాన్ని కలిగి ఉంటుంది. కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (CMA) ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన ఈ ఇండియా-స్పెక్ వోల్వో C40 రీఛార్జ్ మోడల్ 408hp, 660Nm అవుట్‌పుట్‌తో ట్విన్ మోటార్ సెటప్‌ను కలిగి ఉంటుంది.
78kWh బ్యాటరీ ద్వారా శక్తిని అందిస్తుంది. వోల్వో C40 ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 530km (WLTP) దూరం ప్రయాణిస్తుంది. 4.7 సెకన్లలో 0-100 కి.మీల వేగాన్ని అందుకుంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVలో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) స్టాండర్డ్‌గా ఉంది. ధరలను ప్రకటించాక కొనుగోలుదారులు నేరుగా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా (Volvo C40) రీఛార్జ్‌ను బుకింగ్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ SUV డెలివరీలు మాత్రమే డీలర్‌షిప్‌ల ద్వారా జరుగుతాయి. వోల్వో 2030 నాటికి పోర్ట్‌ఫోలియోలో 100 శాతం ఎలక్ట్రిఫైడ్ వాహనాలను కలిగి ఉండాలని, 2040 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
వోల్వో C40 రీఛార్జ్ వాహనం భారతీయ మార్కెట్‌పై వోల్వో కార్ ఇండియా నిబద్ధతకు ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. వోల్వో XC40 రీఛార్జ్ మోడల్ ద్వారా.. C40 రీఛార్జ్ లగ్జరీ మార్కెట్ వాటాను విస్తరించనుందని మేనేజింగ్ డైరెక్టర్, వోల్వో కార్ ఇండియా జ్యోతి మల్హోత్రా పేర్కొన్నారు. ఈ కారు సరికొత్త వినూత్నమైన డిజైన్, అధునాతన ఎలక్ట్రిక్ టెక్నాలజీ, పర్యావరణంపై అంకితభావాన్ని తెలియజేస్తుందని తెలిపారు. స్థిరమైన లగ్జరీతో వంద శాతం లెదర్-ఫ్రీ ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్‌ను అందిస్తుందని ఎండీ జ్యోతి వివరించారు.
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి