ఎర్ర బంగారం రికార్డు బ్రేక్! వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹37,100..

ఎర్ర బంగారం రికార్డు బ్రేక్! వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹37,100..

Warangal Chilli Record Price : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి . బుధవారం వండర్ హాట్ (Wonder Hot) రకం మిర్చి ఆల్ టైం రికార్డు ధరను నమోదు చేసింది. క్వింటాల్ మిర్చి ఏకంగా రూ. 37,100 పలకడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

భూపాలపల్లి రైతుకు దక్కిన రికార్డు ధర

భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన రైతు ఆర్.వినోద్, తన పొలంలో పండించిన 80 బస్తాల వండర్ హాట్ మిర్చిని వ‌రంగ‌ల్‌ ఏనుమాముల మార్కెట్‌కు తీసుకొచ్చారు. కీర్తన అడ్తి షాపు ద్వారా నిర్వహించిన వేలంలో ఈ మిర్చికి అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 37,100 ధర లభించింది. తన పంటకు ఆశించిన దానికంటే ఎక్కువ ధర రావడంతో రైతు వినోద్ ఆనందం వ్యక్తం చేశారు.

గత నాలుగేళ్ల కాలంలో మిర్చికి ఇంత భారీ ధర (Warangal Chilli Price) రావడం ఇదే మొదటిసారి అని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వండర్ హాట్ రకానికి ఉన్న డిమాండ్, రైతు వినోద్ తెచ్చిన మిర్చి నాణ్యతగా ఉండటమే ఈ స్థాయి ధర రావడానికి ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు.


మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.  

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్  కోసం  X , ఫేస్​బుక్​ పేజీ, వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు