Harithamithra Telugu News

Home Agricultue సేంద్రియ వ్యవసాయం ఎర్ర బంగారం రికార్డు బ్రేక్! వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹37,100..

ఎర్ర బంగారం రికార్డు బ్రేక్! వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹37,100..

0
Warangal Chilli Record Price

Warangal Chilli Record Price : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి . బుధవారం వండర్ హాట్ (Wonder Hot) రకం మిర్చి ఆల్ టైం రికార్డు ధరను నమోదు చేసింది. క్వింటాల్ మిర్చి ఏకంగా రూ. 37,100 పలకడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

భూపాలపల్లి రైతుకు దక్కిన రికార్డు ధర

భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన రైతు ఆర్.వినోద్, తన పొలంలో పండించిన 80 బస్తాల వండర్ హాట్ మిర్చిని వ‌రంగ‌ల్‌ ఏనుమాముల మార్కెట్‌కు తీసుకొచ్చారు. కీర్తన అడ్తి షాపు ద్వారా నిర్వహించిన వేలంలో ఈ మిర్చికి అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 37,100 ధర లభించింది. తన పంటకు ఆశించిన దానికంటే ఎక్కువ ధర రావడంతో రైతు వినోద్ ఆనందం వ్యక్తం చేశారు.

గత నాలుగేళ్ల కాలంలో మిర్చికి ఇంత భారీ ధర (Warangal Chilli Price) రావడం ఇదే మొదటిసారి అని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వండర్ హాట్ రకానికి ఉన్న డిమాండ్, రైతు వినోద్ తెచ్చిన మిర్చి నాణ్యతగా ఉండటమే ఈ స్థాయి ధర రావడానికి ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు.


మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.  

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్  కోసం  X , ఫేస్​బుక్​ పేజీ, వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Previous articleWarangal Chilli Price | వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల జోరు: దేశీ రకం రికార్డు స్థాయిలో ₹41,200.. ఎందుకీ పెరుగుదల?
Next articleవేసవి ఎండల్లో మీ EV రేంజ్ తగ్గుతోందా? బ్యాటరీ లైఫ్ పెంచే 6 సూపర్ చిట్కాలు ఇవే!
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here