Harithamithra Telugu News

Home Agricultue వ్యవసాయ వార్తలు Warangal Market | ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఏనుమాముల మార్కెట్..

Warangal Market | ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఏనుమాముల మార్కెట్..

0
Warangal Market chilli price

ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ (Warangal Market) ‘ఎర్ర బంగారం’తో కళకళలాడుతోంది. శుక్రవారం మార్కెట్‌కు రికార్డు స్థాయిలో మిర్చి తరలివచ్చింది. గత నాలుగేళ్ల తర్వాత మళ్లీ ధరలు పుంజుకోవడంతో రైతన్నల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది.

సీజన్‌లోనే రికార్డు స్థాయిలో రాక

ఈరోజు సుమారు 26,292 బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. మార్కెట్ యార్డు అంతా మిర్చి బస్తాలతో నిండిపోయి ఎరుపు రంగు సంతరించుకుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ధరలు మెరుగ్గా ఉండడం విశేషం.

Warangal Market : నేటి గరిష్ఠ ధరల వివరాలు (క్వింటాకు):

నాణ్యత కలిగిన వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి:

మిర్చి రకంగరిష్ఠ ధర (రూ.)
సింగిల్‌పట్టి30,000/-
దేశీ మిర్చి40,000/-
వండర్‌హాట్35,500/-
దీపిక30,000/-
యూఎస్ 34121,100/-
ఎల్లో మిర్చి20,000/-
తేజ రకం19,200/-
తాలు12,500/-

దేశీ మిర్చికి విదేశీ డిమాండ్

ప్రధానంగా జియోట్యాగింగ్ కలిగిన దేశీ మిర్చికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో ఎగుమతులు ఊపందుకున్నాయి. 2021-22లో దేశీ మిర్చి లక్ష రూపాయలు పలికి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాలుగేళ్ల వరకు ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెంది పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. ప్రస్తుతం ధరలు మళ్లీ పుంజుకోవడంతో నిల్వ ఉన్న పంటను బయటకు తీస్తున్నారు. ఇటీవల జయంశంకర్​ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ రైతు తీసుకొచ్చిన మిర్చికి ఏకంగా రూ.50,000 ధరల పలికిన విషయం తెలిసిందే..

ధరలు పెరగడానికి కారణాలు:

వ్యాపారుల విశ్లేషణ ప్రకారం.. ఇతర దేశాలకు ఎగుమతులు పెరగడం. స్థిరమైన ఖమ్మం, వరంగల్ మార్కెట్లలో క్రమంగా సగటు ధర పెరగడం (రూ. 16,300 నుంచి ప్రస్తుతం రూ. 18,489కి చేరింది. ప్రస్తుత సీజన్‌లో నాణ్యమైన పంట మార్కెట్‌కు రావడం ధర పెరగడానికి కారణమని పలువురు పేర్కొంటున్నారు.

    ముగింపు:

    వరంగల్ మార్కెట్‌కు ఉన్న చారిత్రక ప్రాధాన్యత, అంతర్జాతీయ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. రైతులు నాణ్యతను కాపాడుకుంటూ, మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పంటను విక్రయించడం ద్వారా గరిష్ఠ లాభాలు పొందే అవకాశం ఉంది.

    Previous article5% Model Water Conservation | ప్రతి రైతు తన పొలంలో 5% భూమిని కేటాయిస్తే.. నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం!
    Next articleఇన్‌స్టంట్ నూడుల్స్‌కు హెల్తీ ప్రత్యామ్నాయం: మిల్లెట్ నూడుల్స్ ఎందుకు బెస్ట్? – Millet Noodles Benefits
    Kiran Podishetty
    కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here