ఈ మూడు దేశాల్లో తీవ్రమైన వేడిగాలులు
వాతావరణ ప్రతికూలమైన మార్పులు ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలోనూ వినాశనాలు కలిగిస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లో గణనీయమైన హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్న నేపథ్యలో పరిశోధకులు ఇప్పుడు భూమండలపై ప్రమాదకరమైన వడగాల్పులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాలను గుర్తించారు.
గ్లోబల్ వార్మింగ్ అలాగే, శీతోష్ణస్థితి మార్పులను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. అత్యధిక ఉష్ణోగ్రతల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, పాపువా న్యూ గినియా, మధ్య అమెరికా వంటి దేశాలు అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించారు. పెరుగుతున్న జనాభా, పర్యవారణ రక్షణపై శ్రద్ధ లేకపోవడం, పరిమితికి మించి కలుష్యం వెలువడడం వంటివి కారణమని పరిశోధకులు గుర్తించారు.
నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో 31 శాతం ప్రాంతాలలో, రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు అసాధారణంగా ఉందని పరిశోధకులు హైలైట్ చేశారు. ఇలాంటి మార్పు ఏ ప్రాంతంలోనైనా జరుగుతుందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయని తెలిసింది.
బీజింగ్, సెంట్రల్ యూరప్ కూడా హాట్‌స్పాట్‌ల జాబితాలో ఉన్నాయని బృందం కనుగొంది. ఇది మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. నదులు ఎండిపోవడంతో చైనా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే కరువు, నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి.
హీట్‌వేవ్‌లు తరచుగా అడవి కార్చిచ్చులకు కారణమవుతాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రత హిమానీనదాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది ద్రవీభవనానికి దారితీస్తుంది. ఫలితంగా మంచు కరిగిపోయి నదుల ద్వారా సముద్రాల్లో పెద్దమొత్తంలో నీరు కలుస్తుంది. దీంతో సముద్ర తీరాల్లో ఉన్న నగరాలు, పట్టణాలు మునిగిపోయే ప్రమాదం పొంచి ఉంది.