Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Xiaomi SU7 | షావోమీ నుంచి మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జిపై 800 కిమీ రేంజ్..

Spread the love

Xiaomi SU7 | స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ధి చెందిన చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi తాజాగా తన మొదటి ఎలక్ట్రిక్ కారును SU7 ను విడుదల చేసి ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ప్రవేశించింది. మోడల్ పేరులోని “SU” అంటే “స్పీడ్ అల్ట్రా” అని అర్థం. ఆవిష్కరణ సమయంలో Xiaomi SU7 కి సంబంధించిన అధికారిక చిత్రాలను ప్రదర్శించడం తోపాటు  ఈ ఎలక్ట్రిక్ కారు వివరాలను వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ కారును BAIC గ్రూప్ యాజమాన్యంలోని ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ఏడాదికి సుమారు రెండు లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది.

టెస్లా వంటి ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలోని అగ్రశ్రేణి మోడళ్లకు ఈ కొత్త కారు సవాలుగా నిలిచింది. SU7 మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి

  • SU7
  • SU7 ప్రో
  • SU7 మ్యాక్స్

Xiaomi SU7 దాని సొగసైన, ఆధునిక, స్పోర్టీ డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. Xiaomi కారు Hyper OS ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఫాస్ట్‌బ్యాక్ డిజైన్‌ను పోలి ఉండే ఎలక్ట్రిక్ సెడాన్‌గా, SU7  ఉంటుంది. సెల్ఫ్ -పార్కింగ్, కాస్టొమైజ్డ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి

స్పెసిఫికేషన్‌లు

Xiaomi SU7 కారు.. నాలుగు-డోర్ల ఎలక్ట్రిక్ సెడాన్.. ఇది 4,997 mm పొడవు, 1,963 mm వెడల్పు,  1,455 mm ఎత్తు కలిగి ఉంటుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ సెడాన్..  3,000 mm వీల్‌ బేస్‌తో వస్తుంది.

షావోమీ ఎస్ యూ 7 (Xiaomi SU7) ఎంట్రీ-లెవల్ వేరియంట్ 73.6 kWh బ్యాటరీ ప్యాక్‌ ను కలిగి ఉంటుంది.. టాప్-ఆఫ్-ది – లైన్ వేరియంట్ 101 kWh బ్యాటరీ ప్యాక్‌ తో వస్తుంది..  షావోమీ తన సొంత CTB(సెల్-టు-బాడీ) సాంకేతికతను  అభివృద్ధి చేసింది, ఈ SU 7 ఎలక్ట్రిక్ సెడాన్ రేంజ్ 800 కిలో మీటర్లు అని షావోమీ పేర్కొంది.. అంటే.. ఇది సింగిల్ చార్జ్ తో ఈ కారు 800 కి.మీ ప్రయాణిస్తుంది. 2025 లో 1,200 కిమీ రేంజ్ తో  150 kWh బ్యాటరీ ప్యాక్‌తో V8 అనే కొత్త వేరియంట్‌ను షావోమీ కంపెనీ మార్కెట్లోకి తీసుకువస్తోంది.

ఈ ఎలక్ట్రిక్ కారులో.. వేరియంట్ ను బట్టి V6, V6S ఇంజన్లు ఉన్నాయి. వీటి పవర్ అవుట్‌పుట్ 299 hp, 374hp మధ్య ఉంటుంది. గరిష్ట టార్క్ అవుట్‌పుట్ 635 Nm వరకు ఉంటుంది.. ఎంట్రీ లెవెల్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 210 కిలో మీటర్లు కాగా, హై ఎండ్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 265 కిలోమీటర్లు ఉంటుంది.

ఈ షావోమీ SU 7 ఎలక్ట్రిక్ సెడాన్ లో సెల్ఫ్ పార్కింగ్ వంటి లేటెస్ట్ అటానమస్ డ్రైవింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందు కోసం ఈ కార్లలో హై రిజల్యూషన్ కెమెరాలు, లిడార్, అల్ట్రాసోనిక్ రాడార్లను అమర్చారు.

SpecificationsXiaomi SU7[Rear Wheel drive]Xiaomi SU7 Max[Dual-Motor all wheels drive]Xiaomi V8
Acceleration (0-100 km/h)5.28s2.78s
Battery pack73.6 kWh101 kWh CTB150 kWh
Recharge Range668 km800 km1200 km
Top Speed210 km/h265 km/h
Max Horsepower299 ps673 ps
Max Torque400 Nm838 Nm
Peak Output220 kW495 kW
Braking Distance35.5m (100-0 km/h)35.3m (100-0 km/h)
Expected launch date202420242025

SU7 800v హైపర్ ఛార్జ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే కేవలం 5 నిమిషాల ఛార్జ్ తో వినియోగదారులు 220km రేంజ్ ను ఇస్తుంది.. 15 నిమిషాల ఛార్జింగ్ తో  510km వరకు ప్రయాణించవచ్చు.

రంగులు

Xiaomi SU7 మూడు చాలా ఆకర్షణీయమైన మరియు ఆకర్షించే రంగులలో అందుబాటులో ఉంటుంది. అవి క్రింది విధంగా ఉన్నాయి.

  • Aqua Blue
  • Mineral Gray
  • Verdant Green

సేఫ్టీ ఫీచర్స్

Xiaomi SU7 లో ఎన్నో భద్రత ఫీచర్స్ కలిగి ఉంది. హీట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ను పొందుతుంది.

16.1-అంగుళాల సెంటర్ డిస్‌ప్లే మరియు ఫీచర్‌తో కూడిన స్మార్ట్ క్యాబిన్ తో ఉంటుంది.. మొత్తం మీద, Xiaomi SU7 సమగ్రమైన మరియు అత్యాధునిక డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి అధునాతన భద్రతా లక్షణాలు, వినూత్న  అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది. ఇంటర్నల్ డాల్బీ అట్మాస్ స్పీకర్లు, చాట్ యాప్‌లుమెయిన్ స్ట్రీమ్ అప్లికేషన్‌లకు మద్దతునిస్తూ కారు యాప్ ఎకోసిస్టమ్ సజావుగా పనిచేస్తుంది.

ఇది Airplay మరియు iOS CarPlay మద్దతుతో మల్టీ క్యాస్టమైస్డ్ ఆప్షన్స్ ను అందిస్తుంది. సెంట్రల్ స్క్రీన్‌పై ఉన్న UI మల్టీ టాస్కింగ్ కోసం గరిష్టంగా మూడు స్ప్లిట్ విండోలను అనుమతిస్తుంది. వినియోగదారులు తమ Xiaomi ఫోన్ స్క్రీన్‌ కాస్టింగ్ చేయవచ్చు.

ధర

షావోమీ SU7  కార్ల ధరలను ఇంకా వెల్లడించలేదు. ధరలను తెలుసుకోవడానికి ఇది చైనా వెలుపల అందుబాటులో ఉంటుందో లేదో తెలుసుకోవడానికి  కొన్ని నెలలు వేచి చూడాల్సిందే..


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్,  ఫేస్ బుక్ లోనూ సంప్రదించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *