Yo Trust Drift Hx రేంజ్ 100 కి.మీ, టాప్ స్పీడ్ 65Kmph
Yo Bykes ఈరోజు అహ్మదాబాద్‌లో తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్- Yo TRUST Drift Hx-ని ఆవిష్కరించింది. భారత మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌లకు అనుగుణంగా పర్యావరణ అనుకూలమైన వినూత్న పరిష్కారాలను అందించెందుకు ఒక కీలక అడుగు వేసింది.
Yo Bykes మేనేజింగ్ డైరెక్టర్, CEO సమక్షంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో Yo TRUST-Drift Hx మోడల్‌ను ఆవిష్కరించారు. Yo Bykes పోర్ట్‌ఫోలియోలో కొత్తగా చేరిన ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ద్వారా ఈవీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, దేశంలో కార్బన్ పాదముద్రను తగ్గించడానికి కృషి చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.
Yo Bykes ట్రస్ట్ డ్రిఫ్ట్ Hx: స్పెక్స్ & ఫీచర్లు
Yo Trust Drift Hx ఎలక్ట్రిక్ స్కూటర్ 2.5kW BLDC మోటార్ ను కలిగి ఉంటుంది. ఇది 2.65 kW లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తిని పొందుతుంది. ఈ పవర్‌ట్రెయిన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే క్లెయిమ్ చేసిన 100 కిమీ రేంజిని అందిస్తుంది. పనితీరు విషయానికొస్తే, ఈ స్కూటర్ గరిష్టంగా 65 kmph వేగాన్ని అందుకోగలదు. కేవలం 3 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు వేగాన్ని అందుకుంటుంది. 180-265V AC ఛార్జర్‌ని ఉపయోగించి, బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 4-5 గంటల సమయం పడుతుంది.
95 కిలోల బరువుతో, ట్రస్ట్ డ్రిఫ్ట్ Hx టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు స్వింగ్‌ఆర్మ్-లింక్డ్ రియర్ మోనో-షాక్‌పై కూర్చుంది. CBS సహాయంతో 130mm ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌ల ద్వారా స్టాపింగ్ విధులు నిర్వహిస్తుంది. ఫీచర్ల పరంగా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్, బహుళ రైడింగ్ మోడ్‌లు, మొబైల్ ఛార్జింగ్ సాకెట్, రివర్స్ మోడ్ వంటివి ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ సందర్భంగా యో బైక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో ప్రదీప్ కౌడియా మాట్లాడుతూ.. “Yo Bykes రాబోయే ఆర్థిక సంవత్సరంలో లో స్పీడ్హై -స్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాల సమగ్ర శ్రేణిని పరిచయం చేయడానికి సన్నద్ధమవుతోంది . ఈ వ్యూహాత్మక విస్తరణ కేవలం ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడమే కాకుండా మొత్తం వాహన అమ్మకాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. అని పేర్కొన్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.