సింగిల్ చార్జిపై 90కిలోమీటర్లు
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కోమాకి సంస్థ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. సాధారణ ద్విచక్రవాహనాలు నడపలేనవారికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కొమాకి సంస్థ విడుదల చేసిన ఈ . Komaki XGT X5. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 90కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇందులో లెడ్ యాసిడ్, లిథియం అయాన్ బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. లెడ్ యాసిడ్ స్కూటర్‌ను కేవలం రూ. 72,500 లకు ఆర్డర్ చేయవచ్చు. ఇక లిథియం-అయాన్ యూనిట్ రూ .90,500కు లభ్యమవుతుంది.
వృద్దులకు, దివ్యాంగుల కోసం..
కోమాకి దాదాపు ప్రతి నెలా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్లను విడుదల చేస్తోంది. కానీ ఈసారి వృద్ధులతో పాటు ప్రత్యేక అవసరాలు గల వ్యక్తుల(దివ్యాంగులు) కోసం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చి మంచి పనిచేసింది. mechanical parking feature కలిగిన Komaki XGT X5 స్కూటర్‌ను విడుదల చేసింది. స్కూటర్ రెండు వైపులా ప్రత్యేక చక్రాలు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్‌ను ఇప్పటివరకు 1,000 మందికి పైగా వృద్ధులకు విక్రయించినట్లు కొమాకి కంపెనీ పేర్కొంది.
2021 ప్రథమార్ధంలో, కోమాకి తన షోరూమ్‌ల నుండి 21,000 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసింది. XGT X5 ని బుక్ చేసుకోవడానకి కంపెనీ వెబ్‌సైట్‌కు లాగిన్ కావాలి. వినియోగదారులు తమ అభిప్రయాలను ఇందులో పొందుపరచవచ్చు. అన్ని కోమాకి స్కూటర్లు కూడా EMI సదుపాయంతో లభిస్తాయి. తద్వారా ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. మీకు నచ్చినట్లుగా లెడ్ యాసిడ్ లేదా లిథియం-అయాన్ బ్యాటరీలు గల స్కూటర్‌ను వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేయవచ్చు.
లిథియంఅయాన్ స్కూటర్ ధర రూ.90వేలు
Komaki XGT X5 లెడ్-యాసిడ్ స్కూటర్‌ను కేవలం రూ. 72,500 లకు ఆర్డర్ చేయవచ్చు, అయితే లి-అయాన్ యూనిట్ ధర మాత్రం రూ .90,500 ఉంటుంది. రెండు స్కూటర్ల క్లెయిమ్ పరిధి సుమారు 80-90 కిమీ/ఛార్జ్ ఉంటుంది. ఈ స్కూటర్లలో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌లు కూడా ఉంటుంది. ఇవి తక్కువ వేగం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లు. అందువల్ల వీటికి రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ అవసరం లేదు. ఈ రెండు వాహనాలు గంటకు 25 నుంచి 35కిమి వేగంతో ప్రయాణిస్తాయి.
అన్ని వర్గాల ప్రజలకు సేవలు
“ఒక ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారుగా. ఈ దేశ ప్రజలకు ఎవరినీ వదలకుండా సేవ చేయడం మా బాధ్యత అని కోమాకి ఎలక్ట్రిక్ వాహన విభాగం డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా చెప్పారు. తమ కస్టమర్లను సంతోషపెట్టడానికి కొత్త ప్రయాణాలు మొదలు పెట్టామని తెలిపారు. భారతదేశాన్ని హరిత వనంగా తీర్చదిద్దడంలో తమ వంతు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మేము అడుగు పెట్టిన ప్రతి చోటా ప్రజలు మాకు మద్దతు ఇస్తూనే ఉంటారు అని తెలిపారు.
Amazing
Thankyou 🙏
Great innovation