Wednesday, November 6Lend a hand to save the Planet
Shadow

మూడు నెల‌ల్లోనే 2.78ల‌క్ష‌ల ఎల‌క్ట్రిక్ వాహ‌నాల రిజిస్ట్రేష‌న్

Spread the love

దేశంలో భారీగా పెరుగుతున్న విక్ర‌యాలు

2-78 lakh evs registered : 2023 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో భారతదేశంలో 2.78 ల‌క్ష‌ల‌ కంటే ఎక్కువ EVలు రిజిస్టర్ అయ్యాయని కేంద్ర‌మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) రిజిస్ట్రేషన్ 2021లో 3,29,808 నుండి 2022 నాటికి 10,20,679కి పెరిగింది. 2023 క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటివరకు దేశంలో 2.78 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయ‌ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు వాహన్ పోర్టల్‌కు మారే ప్రక్రియలో ఉన్నాయని, అందువల్ల EV రిజిస్ట్రేషన్‌పై వారి డేటా పాక్షికంగా చేర్చబడిందని, తెలంగాణ, లక్షద్వీప్ డేటా పోర్టల్‌లో అందుబాటులో లేదని గడ్కరీ లోక్‌సభకు లిఖితపూర్వకంగా పేర్కొన్నారు.

READ MORE  Ather Rizta స్కూటర్ కి భారీగా డిమాండ్.. ఎందుకంటే..?

పోర్టల్‌లోని డేటా ప్రకారం.. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) రిజిస్ట్రేషన్ 2021లో 3,29,808 నుండి 2022 నాటికి 10,20,679కి పెరిగింది. 2016-17 నుంచి 2022-23 మధ్య కాలంలో (ఫిబ్రవరి 2023 వరకు) గ్రీన్ హైవేస్ పాలసీ కింద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) 344.27 లక్షల చెట్లను నాటినట్లు ప్రత్యేక ప్రశ్నకు సమాధానంగా గడ్కరీ తెలిపారు.

మరో ప్రశ్నకు బదులిస్తూ, బ్రౌన్‌ఫీల్డ్ జాతీయ రహదారులు .. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేల మీదుగా ప్రతి 30-40 కిలోమీటరుకు వేసైడ్ ఎమినిటీస్ (డబ్ల్యుఎస్‌ఎ) అభివృద్ధి చేయాల‌ని ఎన్‌హెచ్‌ఎఐ భావిస్తోందని చెప్పారు. ప్రస్తుతం, వాలంటరీ వెహికల్-ఫ్లీట్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్ (V-VMP) కోసం దరఖాస్తులను స్వీకరించడానికి 18 రాష్ట్రాలు/UTలు నేష‌న‌ల్ సింగిల్ విండో సిస్టమ్ (NSWS) కోసం సిద్ధ‌మ‌య్యాయ‌ని మంత్రి తెలిపారు.

READ MORE  Ather Rizta స్కూటర్ కి భారీగా డిమాండ్.. ఎందుకంటే..?

NSWS ప‌రిధిలో ప్ర‌స్తుతం ఉన్న‌ రాష్ట్రాలు/UTలలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ న్నాయి.

17 రాష్ట్రాల్లో రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాల ఏర్పాటు కోసం 79 మంది పెట్టుబడిదారుల నుండి ప్రభుత్వానికి దరఖాస్తులు అందాయని, వాటిలో 48 ఆయా రాష్ట్రాలు ఆమోదించాయని ఆయన చెప్పారు.

మంత్రి అందించిన డేటా ప్రకారం, జనవరి 2022 నుండి మార్చి 20, 2023 వరకు దేశంలో 8,220 పాత వాహనాలు స్క్రాప్ చేయబడ్డాయి. ఉత్తరప్రదేశ్ (6,247), గుజరాత్ (1,244), అస్సాం (357)లో అత్యధికంగా పాత వాహనాలు స్క్రాప్ చేశారు.

READ MORE  Ather Rizta స్కూటర్ కి భారీగా డిమాండ్.. ఎందుకంటే..?

గడ్కరీ ప్రకారం, ప్రైవేట్ పెట్టుబడిదారులకు సులభంగా వ్యాపారం చేయడానికి నేష‌న‌ల్ సింగిల్ విండో సిస్టమ్ (NSWS) ద్వారా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు,  రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మంజూరు కోసం దరఖాస్తులను మంత్రిత్వ శాఖ సులభతరం చేసింది.

tech news

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *