Home » దేశంలోనే అతిపెద్ద EV charging depot

దేశంలోనే అతిపెద్ద EV charging depot

largest EV charging depot
Spread the love
  • 11,000 చదరపు అడుగుల విస్తీర్ణం

  • ఒకేసారి 70 ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్

మెజెంటా మొబిలిటీ (Magenta Mobility ) సంస్థ దేశంలోనే అతిపెద్ద‌దైన EV ఛార్జింగ్ డిపో (largest EV charging depot) ను ఇటీవ‌ల ప్రారంభించింది. ఈ కొత్త ఛార్జింగ్ డిపో 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్త‌రించి ఉంటుంది. 3.3 kW సామ‌ర్థ్యం క‌లిగిన 63 AC ఛార్జర్‌ల ఇందులో ఏర్పాటు చేశారు. అలాగే 15kW GB/T సామ‌ర్థ్యంతో 3 DC ఛార్జర్‌లు ఇక్క‌డ ఉంటాయి. ఈ చార్జింగ్ స్టేష‌న్ బెంగళూరులోని బిలేకహళ్లిలో ప్రారంభించారు. దీనిని BESCOM GM (DSM) BV OEM భాగస్వామ్యంతో పరిశ్రమ నిపుణులు ఎలక్ట్రిక్ వాహన ఔత్సాహికులు దీనిని ఏర్పాటు చేశారు.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

electric vehicles ను స‌మ‌ర్థ‌వంతంగా చార్జింగ్ పెట్టుకోవ‌డానికి ఇక్క‌డ కావ‌ల‌సినంత ఎక్కువ పార్కింగ్ స్థ‌లం ఉంటుంది. ఇది బెంగళూరులోని మెజెంటా మొబిలిటీకి సంబంధించి 23వ ఛార్జింగ్ డిపోగా నిలిచింది. FY 23-24 మొదటి త్రైమాసికంలో మరో 14 చార్జింగ్ స్టేష‌న్ల ప్లాన్‌తో భారతదేశంలో 35వ ఛార్జింగ్ డిపోగా గుర్తించబడింది.

ఈ largest EV charging depot ఒకే సమయంలో 70 ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయగల సామర్థ్యం క‌లిగి ఉంది. ఇది ఇప్పటి వరకు మెజెంటా ఏర్పాటు చేసిన స్టేష‌న్ల‌లో ఇదే పెద్ద‌ది. ఇందులో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు, ప‌క‌డ్బందీగా సీసీ కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ వంటి సౌక‌ర్యాలు క‌లిగి ఉన్నాయి.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

అలాగే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల రిపేర్ల‌కోసం డెడికేటెడ్ షెడ్, స్పేర్స్, ఇన్వెంటరీని నిర్వహించడానికి స్టోర్ రూమ్, వాహ‌న య‌జ‌మానుల‌కు తాగునీరు, టాయిలెట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలతో పాటు అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఛార్జర్‌లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి 315 kVA సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.

Ev News

 

2 thoughts on “దేశంలోనే అతిపెద్ద EV charging depot

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *