Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో 2022 Hero Optima CX

Spread the love

పెరిగిన రేంజ్, క్రుయిజ్ కంట్రోల్‌, రివ‌ర్స్ మోడ్‌, రిపేయిర్ మోడ్‌..

దేశంలోని దిగ్గ‌జ ఈవీ కంపెనీ Hero Electric త‌న పాపులర్ ఎల‌క్ట్రిక్ వాహ‌న‌మైన Hero Optima స్కూట‌ర్‌ను అత్యాధునిక ఫీచ‌ర్ల‌ను జ‌త చేసి ఆప్‌గ్రేడ్ చేసింది. 2022 Hero Optima CX పేరుతో ఇది విడుద‌ల కానుంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హీరో ఆప్టిమా CX, హీరో ఆప్టిమా CX ER (ఎక్స్‌టెండెడ్ రేంజ్) అనే రెండు వేరియంట్ల‌లో అందుబాటులో ఉంటుంది. హీరో ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్‌లో గణనీయమైన మార్పులను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది.

2022 Hero Optima CX ఫీచర్లు

Optima CX డిజైన్‌ను 2022 ప్రమాణాలకు అనుగుణంగా రీస్టైల్ బాడీని చూడ‌వ‌చ్చు. కొత్త Optima CX 25 శాతం శక్తివంతమైనదిగా, ఇంకా 10 శాతం మరింత సమర్థవంతమైన ఎలక్ట్రిక్ మోటారును అమ‌ర్చ‌నున్నారు.
ఎంట్రీ-లెవల్ CX వేరియంట్ ఒకే 52.2V / 30Ah లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్క‌సారి చార్జిపై 82కిమీ రేంజ్‌ను అందిస్తుంది.

ఇక ఇందులోనే మ‌రో వేరియంట్ రెండు బ్యాటరీ ప్యాక్‌లను క‌లిగిన‌ 2022 Optima CX ER మోడ‌ల్‌ 140km పరిధిని కలిగి ఉంటుంది. ఇందులో 550W ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది 1.6bhp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ స్కూటర్‌ 45kmph వేగంతో ప్ర‌యాణిస్తుంది. ఇది ప్ర‌స్తుత‌మున్న Optima HXతో పోలిస్తే 3kmph వేగం ఎక్కువ‌గా ఉంటుంది. బ్రేకింగ్ సామర్ధ్యాలు కూడా దాదాపు 30 శాతం పెరిగాయి. ఇందులో కొత్త‌గా రీడిజైన్ చేసిన కార‌ణంగా వాహ‌నం దృఢత్వం సుమారు 25 శాతం మెరుగుపడింది.

ఇత‌ర ఫీచర్ల విషయానికి వస్తే, Hero Optima CX స్కూటర్ లో నేటి త‌రాన్ని ఆకర్షించే కొన్ని ఫీచర్లను జోడించారు. అందులో క్రూయిజ్ కంట్రోల్, వాక్ అసిస్ట్, రివర్స్ మోడ్, మెరుగుప‌రిచిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్, LED లైటింగ్ సిస్టమ్‌లు, యాంటీ-థెఫ్ట్ అలారం సిస్టమ్‌తో కూడిన రిమోట్ కీ వంటి కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఉంటాయి.

Optima CX బరువు 82 కిలోలు కాగా, అదనపు బ్యాటరీ ప్యాక్ కారణంగా Optima CX ER బరువు 93కిలోల కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. Optima CX యొక్క రెండు వేరియంట్‌లు బ్లూ, గ్రే మరియు వైట్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయి.

అదనపు ఫీచర్ల తో కూడిన ఈ 2022 Hero Optima CX (ER) ధర (ఎక్స్-షోరూమ్) రూ. 77,490. Hero Electric Optima CX సింగిల్ బ్యాట‌రీ వేరియంట్ (ఎక్స్‌షోరూం) ధ‌ర  Rs 62,190 ఉండొచ్చ‌ని భావిస్తున్నారు.

For More Videos Please visit :  Harithamithra Youtube channel

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *