2024 Bajaj Chetak Premium Electric scooter : గత సంవత్సరం 2023 చివర్లో బజాజ్ చేతక్ తక్కువ ధరలో అర్బేన్ వేరియంట్ ను ప్రారంభించిన విషయంతెలిసిందే.. అయితే తాజాగా బజాజ్ ఇప్పుడు టాప్ రేంజ్ వేరియంట్ అయిన బజాజ్ చేతక్ ప్రీమియం వేరియంట్ ను ఆవిష్కరించింది. 2024 ప్రీమియం వేరియంట్ ధర రూ.1.35 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది మునుపటి మోడల్ తో పోలిస్తే రూ.15,000 పెరిగింది. అప్‌డేట్ చేసిన చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ కి మరో ప్రధాన ఆకర్షణ కొత్త 5-అంగుళాల TFT డ్యాష్ బోర్డ్.. దీంతో ఇతర EVలు అంటే ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ల స్థాయికి బజాజ్ కూడా చేరుకుంటుంది. మీ స్మార్ట్‌ఫోన్‌ను డాష్‌కి కనెక్ట్ చేయడం వల్ల నావిగేషన్ అప్‌డేట్‌లు, నోటిఫికేషన్ అలర్ట్‌లు, మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లను పొందవచ్చు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే.. ఈ ఫీచర్‌లు.. సీక్వెన్షియల్ ఇండికేటర్‌లు, స్పోర్ట్ రైడింగ్ మోడ్ మీరు చేతక్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఐచ్ఛికంగా రూ.9,000 TecPac తీసుకుంటే మాత్రమే అందుబాటులో ఉంటాయి.
2024 Bajaj Chetak Premium Electric scooter అర్బేన్ వేరియంట్ గ్రే, సైబర్ వైట్, బ్రూక్లిన్ బ్లాక్, ఇండిగో మెటాలిక్ బ్లూ రంగులలో అందుబాటులో ఉంది. అయితే చేతక్ ప్రీమియం హాజెల్‌నట్, ఇండిగో మెటాలిక్ బ్లూ, బ్రూక్లిన్ బ్లాక్ రంగుల్లో లలో లభిస్తుంది
ఈవీ మార్కెట్‌లో పోటీదారులకు భిన్నంగా బజాజ్ చేతక్ పూర్తి మెటల్ బాడీతో వస్తుంది.
కొత్త చేతక్ పాత 2.9kWh యూనిట్ స్థానంలో పెద్ద 3.2kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్‌తో, బజాజ్ 127కిమీల రేంజ్ ని ఇస్తుంది. గంటకు 73కిమీల వేగంతో ప్రయాణిస్తుంది. చేతక్ వేరియంట్‌లు ప్రధానంగా ఏథర్ 450 తోపాటు Ola S1, టీవీఎస్ ఐక్యూబ్ తో పోటీ పడుతాయి.
[table id=17 /]