Electric Three Wheelers in India | భారత్ లో ఈవీ మార్కెట్ దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలే కాకుండా ఎలక్ట్రిక్ కార్లతోపాటు త్రీవీలర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగుతున్నాయి. తాజాగా IEA కొత్త నివేదిక ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా విక్రయించిన ప్రతీ ఐదు ఎలక్ట్రిక్ త్రీవీలర్లలో ఒకటి ఎలక్ట్రిక్ వేరియంట్ ఉంటోంది. వాటిలో దాదాపు 60% భారతదేశంలోనే సేల్ అయ్యాయయని తాజా నివేదిక వెల్లడించింది.
” గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఔట్‌లుక్ ” నివేదిక ప్రకారం.. భారతదేశంలో E-3W అమ్మకాలు పెరగడానికి ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME II) పథకం కింద ప్రభుత్వ రాయితీలు దోహద పడ్డాయి. మొత్తం మీద, 2023లో దాదాపు 1 మిలియన్ ఎలక్ట్రిక్ 3Wలు ప్రపంచవ్యాప్తంగా సేల్ అయ్యాయి. 2022 తో పోల్చితే సుమారు 30% పెరిగాయి. ప్రపంచ మార్కెట్ అత్యధికంగా చైనా, భారతదేశంలోనే కేంద్రీకృతమై ఉంది ఈ రెండు దేశాలు మొత్తం ఎలక్ట్రిక్ 95%, సంప్రదాయ 3W అమ్మకాలలో 80% వాటాను కలిగి ఉన్నాయి.
భారతదేశంలో ఎలక్ట్రిక్ త్రీవీలర్ల అమ్మకాలు 2023లో 580,000 యూనిట్లను అధిగమించాయి. చైనాలో అమ్మకాలు 2023లో 8% క్షీణించి 320,000 వాహనాలకు పడిపోయాయి. దీనితో దేశం భారతదేశం తర్వాత రెండవ అతిపెద్ద ఎలక్ట్రిక్ 3W మార్కెట్‌గా చైనా నిలిచింది. 2023లో దాదాపు 6 మిలియన్ల ఎలక్ట్రిక్ 2W అమ్మకాలతో గ్లోబల్ ఎలక్ట్రిక్ 2W అమ్మకాలలో చైనా 78% వాటాను కలిగి ఉండగా, భారతదేశంలో 880,000 వాహనాలు, ASEAN దేశాలలో 380,000 విక్రయించబడ్డాయి.
ఇదిలా ఉండగా, భారతీయ ఎలక్ట్రిక్ 2W మార్కెట్‌లో ఐదు అతిపెద్ద దేశీయ తయారీదారుల్లో ఓలా ఎలక్ట్రిక్, TVS మోటార్, ఏథర్, బజాజ్, ఆంపియర్ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మొత్తంగా, ఈ ఐదు కంపెనీలు 75% కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేశాయి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..