Thursday, March 13Lend a hand to save the Planet
Shadow

Ampere Nexus | రేపే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌..

Spread the love

Ampere Nexus Launch | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి కొత్త ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ (Ampere Nexus )ను ఏప్రిల్ 30న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించిన ప్రొడక్షన్-స్పెక్ NXG ఎలక్ట్రిక్‌ -స్కూటర్ అయిన నెక్సస్, ఆంపియర్ EV లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలిచింది.

ఆంపియర్ నెక్సస్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ లో నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. ఇందులో LFP (లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్) బ్యాటరీని వినియోగించారు. ముందువైపు డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉన్న మొదటి ఆంపియర్ ఇ-స్కూటర్ కూడా ఇదే అవుతుంది. స్కూప్ ఫోటోగ్రాఫ్‌లు బాడీవర్క్‌తో ఫ్లష్‌గా ఉండే ఫుట్‌పెగ్‌లు, చుట్టూ LED లైటింగ్ తో ఉన్న‌ Nexus ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ చూడ్డానికి ప్రీమియం- స్కూటర్ క‌నిపిస్తోంది.

సోష‌ల్ మీడియాలో షేర్ అయిన ఫొటోలు నెక్సస్‌లో పెద్ద డిజిటల్ డిస్‌ప్లే కనిపించింది. అయితే ఇది TFT లేదా LCD యూనిట్ కాదా అనేది లాంచ్ త‌ర్వాత తెలుస్తుంది. ఆటో ఎక్స్‌పో 2023లో ఆంపియర్ NXG కాన్సెప్ట్ – ఇది నెక్సస్‌గా పరిణామం చెందిందని కంపెనీ పేర్కొందిజ. ఇది ఒకే ఛార్జ్‌పై 120కిమీల రేంజ్ కలిగి ఉంటుంది. అయితే ఖచ్చితమైన సామర్థ్యం ఎంత అనేది ఇంకా తెలియ‌రాలేదు.

Nexus స్కూట‌ర్ లో LFP (లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్) బ్యాటరీని ఉపయోగిస్తుంది ఎందుకంటే ఆంపియర్ దాని వెబ్‌సైట్‌లో ‘సురక్షితమైన బ్యాటరీ’ని కలిగి ఉంటుందని పేర్కొంది. LFP అనేది సురక్షితమైన బ్యాటరీగా గుర్తింపు పొందింది. యాంపియర్ ప్రైమస్ ధర రూ. 1,46,355 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) అయితే, కొత్త ఆంపియర్ నెక్సస్ భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో కాస్త ఎక్కువ ధర ఉంటుందని తెలుస్తోంది.
ఇదిలా ఉండ‌గా FY2024లో రికార్డు స్థాయిలో 944,000 కు పైగా వివిధ కంపెనీల‌కు చెందిన‌ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ.. ఆంపియర్ వాహనాల అమ్మకాలు 55,043 యూనిట్లుగా ఉన్నాయి. ఇది ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్‌ మోటార్ కో, ఏథర్ ఎనర్జీ, బజాజ్ ఆటో తర్వాత 6% మార్కెట్ వాటాతో ఐదవ స్థానంలో నిలిచింది. కొత్త Ampere Nexus మార్కెట్‌లో కంపెనీకి తాజా కొత్త ఎన‌ర్జీని ఇస్తుందా? అనేది చూడాలి..


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..