Thursday, December 26Lend a hand to save the Planet
Shadow

Bgauss RUV 350 | 16 అంగుళాల వీల్స్ తో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Spread the love

Bgauss RUV 350 |  భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన BGauss తన సరికొత్త RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌ను ఇటీవ‌లే విడుదల చేసింది. ఈ కొత్త ఆఫర్ ధర (ఎక్స్-షోరూమ్) ₹1.10 లక్షల నుంచి ₹1.35 లక్షల మధ్య ఉంటుంది ‘ రైడర్ యుటిలిటీ వెహికల్’గా పిలువబడే RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్.. కాస్త‌ మోటార్ సైకిల్ ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు BGaus ₹20,000 విలువైన ప్ర‌యోజ‌నాల‌ను అంద‌జేస్తోంది. ఇందులో ఎక్స్ టెండెడ్‌ వారంటీ, బీమా, కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.

Bgauss RUV 350 స్పెసిఫికేషన్లు

RUV 350 Design and Structure : విభిన్నమైన క్రాస్-బాడీ డిజైన్ తో RUV 350 D15 ప్రో మోడ‌ల్ ను పోలి ఉంటుంది. కానీ ఇది పూర్తిగా కొత్త నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది పెద్ద చక్రాలు, సాంప్రదాయ ఇ-స్కూటర్‌లకు సమానమైన ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్‌తో స్టెప్-త్రూ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ స్కూట‌ర్ ఫ్రేమ్ తో ఒక లక్ష కిలోమీటర్లకు పైగా కఠిన ప‌రిస్థితుల్లో ప‌రీక్షించారు. మెరుగైన స్థిరత్వం, హ్యాండ్‌లింగ్ కోసం టీవీఎస్ యూరోగ్రిప్ నుంచి ట్యూబ్‌లెస్ టైర్‌లతో అమర్చబడిన 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ను ఇందులో వినియోగించారు.

RUV 350 ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్‌తో వస్తుంది, సస్పెన్షన్ సిస్టమ్ సంప్రదాయ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల కంటే 1.25 రెట్లు ఎక్కువ మ‌న్నిక‌గా సున్నితమైన ప్రయాణాన్ని ఆస్వాదించ‌వ‌చ్చు. బ్రేకింగ్ విష‌యానికొస్తే ముందు, వెనుక రెండింటిలోనూ డ్రమ్ బ్రేక్‌లను చూడ‌వ‌చ్చు. స్కూటర్ ఓపెన్ గ్లోవ్‌బాక్స్, మల్టిపుల్ హుక్స్, హాఫ్-ఫేస్ హెల్మెట్ కు స‌రిప‌డా అండ‌ర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. ఛార్జర్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లోర్‌బోర్డ్ క్రింద అదనపు స్టోరేజ్ ఉంది.

[table id=37 /]

స్మార్ట్ ఫీచర్లు..

RUV 350 బేస్ వేరియంట్‌లో స్టాండర్డ్‌ LCD డిస్‌ప్లే ఉంటుంది. అయితే ఇందులో టాప్-ఎండ్ మ్యాక్స్ ట్రిమ్ లో 5-అంగుళాల TFT స్క్రీన్‌ను కలిగి ఉంది. టచ్ డిస్ప్లే కాన‌ప్ప‌టికీ TFT యూనిట్ వివిధ సమాచారాన్ని స్విచ్ గేర్ (జాయ్ స్టిక్) ద్వారా కంట్రోల్ చేయ‌వ‌చ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్‌లు, రైడింగ్ గణాంకాల తోపాటు మరిన్నింటిని అందిస్తోంది. మిడిల్, టాప్ వేరియంట్‌లో క్రూయిజ్ కంట్రోల్, ఫాల్ సేఫ్, రివర్స్ మోడ్, హిల్ హోల్డ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *